అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ రెడ్‌మండ్‌లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో సీఈవో సత్య నాదెళ్లతో సమావఏశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మించాలని యోచిస్తున్నారని.. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని.. ఈ రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి ఆంధ్రప్రదేశ్ వద్ద అందుబాటులో ఉందని సత్యనాదెళ్లకు లోకేష్ తెిపారు. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. ఏపీ యువతలో ఉన్న ఐటి, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిటెక్‌కు ఎఐని అనుసంధానించడం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని కోరాు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతోపాటు మంచి ఎకో సిస్టం ఉందని .. క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఎఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకరించాలని కోరారు. అమరావతిని ఎఐ క్యాపిటల్ గా తయారు చేసేందుకు ఎఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈ యూనివర్శిటీతో పాటు ఏపిలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు.
ఇప్పటికిప్పుడు పెట్టుబడులకు ఓకే చేయకపోయినా… తాము మంచి సౌకర్యాలు కల్పిస్తామన్న ప్రతిపాదనను మల్టీనేషనల్ కంపెనీల ముందు ఉంచడం వల్ల ఇవాళ కాకపోతే రేపైనా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యూహంతోనే ఎక్కువగా లోకేష్ ఏపీ లో ఉన్న అవకాశాలను అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.