వైసీపీ నేతలు విదేశాలకు వెళ్లిపోతున్నారు. మళ్లీ ఎప్పుడు వస్తారో కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్న ఓ టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నారు. వీరిలో అత్యధిక మంది వివిధ కేసుల్లో నిందితుడు. తాను విదేశీ పర్యటనకు వెళ్తానని విజయసాయిరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఏ దేశానికి వెళ్తారో చెప్పకుండా ఆయన పర్మిషన్ అడగడం ఆసక్తికరంగా మారింది. మరో నిందితుడు అవినాష్ రెడ్డి కూడా తాను ఎదుర్కొంటున్న వివేకా హత్యకేసులో పెట్టిన బెయిల్ షరతుల మేరకు తనకూ విదేశీ పర్యటనకు అవకాశం కల్పించాలని పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
ఇక ఎన్నికల సమయంలో వివాదాస్పదమైన మరో జగన్ బంటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాను సింగపూర్ పోవాలనుకుంటున్నానని తన కొడుకు అక్కడ కాలేజీలో చేరుతున్నాడని పిటిషన్ పెట్టుకున్నారు. కానీ ఆయన కుమారుడు ఇంకా చదువుతున్నాడా.. షెల్టర్ కోసం సింగపూర్ ను ఎంచుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు బొత్స సత్యనారాయణ ఇప్పుడు దేశంలో లేరు. ఆయన అమెరికా వెళ్లిపోయారు . కొన్ని నెలల పాటు రారని అంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన అనేక మంది విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉండటంతో ఏపీ పోలీసులు కీలక నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గతంలో చెవిరెడ్డి కొడుకుతో పాటు దేవినేని అవినాష్ లాంటి వాళ్లు పారిపోయేందుకు చేసిన ప్రయత్నాలు లుకౌట్ నోటీసుల వల్ల విఫలమయ్యాయి. సజ్జలపై కూడా లుకౌట్ నోటీసులు ఉన్నాయి. నేరాల్లో నిందితులుగా ఉన్న చాలా మందిపై నిఘా పెట్టారు.