రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. మా పర్సనల్ అంశాల జోలికి వస్తే మీ పర్సనల్ అంశాలను బయట పెడతామని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే సమవేశం పెట్టి మరీ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారు. అప్పటికే ఆయన దగ్గర రేవంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారం అంతా ఉందన్నట్లుగా ఆయన బెదిరింపులు ఉన్నాయి.
జూబ్లిహిల్స్, దుబాయ్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఇన్ని సిటీల పేర్లు చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి అన్ని చోట్లా రేవంత్ రెడ్డి ఏం చేశారో తెలుసునని ఆయన పర్సనల్ అంశాల జోలికి వెళ్లడం మానకపోతే అన్నీ బయట పెడతామన్నారు. అవి బయట పెడితే భార్యా బిడ్డలు ఇంటికి కూడా రానివ్వరని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఎటాక్ తో ఆయనకు కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ తహతహలాడిపోతోంది. ఏదైనా వీడియో క్లిప్ ఇస్తే పండగ చేస్తామని ఆ పార్టీ సోషల్ మీడియా అనుకుంటోంది.కానీ రేవంత్ రెడ్డి గురించి మొత్తం తెలుసని ఇంకా పాడి కౌశిక్ రెడ్డి బెదిరింపుల దగ్గరే ఉన్నారు.
రేవంత్ కు సంబంధించి ఆయనకు డ్యామేజ్ చేసేది ఏ చిన్న విషయం ఉన్నా దాచి పెట్టుకుని బెదిరింపులకు దిగే స్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లేదు. పాడి కౌశిక్ రెడ్డి వంటి నేతలు చేసే ఆరోపణలు.. బెదిరింపులు కామెడీగా ఉంటాయి కానీ..సీరియస్ గా ఉండవు. కానీ అదే పని చేస్తున్నారు.