మీరు ఏమైనా చేసుకోండి నేను మాత్రం ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇవ్వను అని జగన్ రెడ్డి తుది నిర్ణయానికి వచ్చేశారు. జగన్ రెడ్డి మనస్థత్వం ప్రకారం చూస్తే.. తనకతు పగ ప్రతీకారాలే ముఖ్యం. తనను సమర్థించకపోతే సొంత తల్లిని కూడా ఎలాంటి మాటతో అయినా సరే తిట్టిస్తామని గతంలోనే బయటపడింది. ఇప్పుడు ఆస్తుల వివాదంలో కూడా జగన్ అలాగే వ్యవహరిస్తున్నారు. తల్లి, చెల్లి ఇద్దరూ ఆస్తుల కోసమే ఉన్నారని.. తన డబ్బు కోసమే ఉన్నారన్నట్లుగా వ్యవహరిస్తూ వారిని దూరం పెట్టేశారు.
కుటుంబవనరుల ద్వారా సంపాందించిన ఆస్తిని వైఎస్ తన నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు చెందేలా రాయాలని నిర్ణయించారు. ఇలా ఆస్తుల్ని పంచుదామని నిర్ణయించుకున్న సమయంలో ఆయన హెలికాఫ్టర్ ప్రమాదానికి గురయ్యారు అని వైఎస్ విజయమ్మ లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ ఏదో లింక్ కనిపిస్తూ ఉన్నా అది అంతర్గతంగా మాత్రమే చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు ఆస్తుల విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. ఏదో లోతైన కుట్ర ఉందన్న ఆరోపణలు బలపడే అవకాశం ఉంది.
ఆస్తుల విషయంలో జగన్ రెడ్డి ఎవర్నీ లెక్క చేయదల్చుకోలేదు. తాను ఒక్క రూపాయి కూడా తల్లి, చెల్లికి ఇచ్చేది లేదని అంటున్నారు. తాను రాజకీయాల్లో ఉన్నానని ప్రజలు చీదరించుకుంటారని కూడా ఆలోచించకుండా ఆయన తల్లి, చెల్లిపై కోర్టుకు వెళ్లారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. నిజానికి ఆ తల్లి, చెల్లి జగన్ కోసం చేసిన కష్టం ప్రజల ముందు ఉంది. జగన్ కు అవసరమైనప్పుడల్లా జనాల్లో వచ్చి .. మా బాబును మీకప్పగిస్తున్నానని కన్నీరు పెట్టుకునేవారు. ఆ సెంటిమెంట్ ఎప్పటికప్పుడు వర్కవుట్ అయ్యేది.
తన కోసం పని చేసిన వారిని జగన్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోరు.. కనీసం జన్మనిచ్చిన తల్లిని, చెల్లిని కూడా సాధించి.. వారికి ఆస్తులు ఎగ్గొట్టి … కట్టుకున్న ప్యాలెస్లలో ఒంటరిగా ఏం చేస్తారన్నది ఆయనకే తెలియాలి.