కేటీఆర్ మెడకు ఫార్ములా వన్ ఈ రేసు స్కాం చుట్టుకుంటోంది. కేసీఆర్, హరీష్‌ల దగ్గరకు కాళేశ్వరం చేరుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మొత్తం డీపీఆర్ అవకవతకాలు, ప్లాన్లు మార్చిన అంశంపై అధికారులను క్రాస్ ఎగ్జామిన్ పూర్త చేశారు. అన్ని రకాల ఫైళ్లను తెప్పించుకుని అధ్యయనం చేశారు. అందరూ చెప్పేది ఒక్కటే మాకేమీ తెలియదు.. కేసీఆర్, హరీష్ రావు చెప్పినట్లుగా చేశాం అనే. వాళ్లంతా కేసీఆర్, హరీష్ మీద అన్ని తోసేయడం లేదు..నిజంగానే మొత్తం వారే చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వంలో కేసీఆర్ సీఎం అయితే హరీష్ రావు జలవనరుల మంత్రి. కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్లు చేస్తే హరీష్ రావు అమలు చేశారు. కాళేశ్వరం అప్పులు.. రీ డిజైన్లు అన్నీ ఇలా ఇద్దరి కనుసన్నల్లోనే జరిగాయి. అధికారులు జీ హూజూర్ అని.. ఎక్కడ సంతకాలు పెట్టాలంటే అక్కడ పెట్టారు., అంతా లోపభూయిష్టం అని తేలడంతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దీపావళి తర్వతా కేసీఆర్, హరీష్‌లకు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీపావళి తర్వాత బాంబులు పేలుస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆ బాంబులేమిటో తెలియక బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ముఖ్యనేతలందర్నీ జైలుకు పంపే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. ఇంకా వేధింపులు ఉంటాయని కేటీఆర్ చేసిన ట్వీట్‌కు అర్థం అదే. దీపావళిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటే … అక్కడ్నుంచి పండగ సంబరాలే లేకుండా పోయాయి. ముందు ముందు ఎన్ని కష్టాలు పడాలో అన్న టెన్షన్ బీఆర్ఎస్లో వినిపిస్తోంది.