బీఆర్ఎస్కు చెందిన ఓ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. మంత్రి పదవి కాకపోయినా కేబినెట్ ర్యాంక్ తో ఏదైనా పదవి ఇస్తే సర్దుకుంటానని ఆయన హైకమాండ్ కు స్ఫష్టం చేశారు. అనుచరులతో కలిసి పార్టీలో చేరేందుకు ఆయన రెడీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్‌తో పాటు ఉన్న వాళ్లు కూడా పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. ఆయన వెళ్లింది ఈ నేత చేరికకు క్లియరెన్స్ కోసమని బీఆర్ఎస్లో ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది.
బీఆర్ఎస్ మాజీ మంత్రి గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డితోనూ ఆయనకు మంచి పరిచయాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన చేరికకు రేవంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన కేబినెట్ ర్యాంక్ పదవి కోరిక తీర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో ఎప్పుడు హైకమాండ్ నుంచి సమాచారం వస్తే అప్పుడు చేరిపోతానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఫోన్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయే నేతల్ని ఆపడం సాధ్యం కాదని ఆ పార్టీ పెద్దలకు తెలుసు. అందుకే ఎవరెవరు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నారన్నదానిపై సమాచారం ఉన్నా.. తెలియనట్లుగానే ఉంటున్నారు. బుజ్జగించే ప్రయత్నాలు చేయడం లేదు.