విశాఖపట్నంను ఒక సారి వెళ్లి వచ్చిన వారికి అక్కడ ఓ మంచి ఇల్లు కట్టుకుని ఉండిపోవాలని అనిపిస్తుంది. ఇలా సామాన్యులకే కాదు.. ధోనీ లాంటి వారికి కూడా అనిపిస్తుంది. విదేశాల్లోనూ అద్భుతమైన బీచ్ సిటీలకు ఏ మాత్రం తీసిపోని నగరం విశాఖ. అందుకే ఓ సారి ఆ సిటీని చూడటానికో.. ఉండటానికో అవకాశం వచ్చిన వారు.. మళ్లీ తమ బాధ్యతలన్నీ తీర్చుకున్న తర్వాత అక్కడికే స్థిరపడాలని అనుకుంటారు. అందుకే విశాఖ ప్రశాంత జీవనానికి సరైన డెస్టినేషన్‌గా కనిపిస్తోంది.
విశాఖ పూర్తిగా మెట్రోగా మారకపోవడం… ఎంత ఎదుగుతున్నాఆధునిక జీవన శైలి పేరుతో ప్రశాంతత చెడగొట్టుకోకపోవడం పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఏ ఒక్క కాలనీ అనో కాదు మొత్తం సిటీ అక్కడ పుట్టిన పెరిగిన వారికీ అద్భుతంగా ఉంటుంది. కొత్తగా వెళ్లిన వారు అయితే మెస్మరైజ్ అవుతారు. అవకాశం ఉన్న వారు వెంటనే ఓ ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటారు. అందుకే విశాఖ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ జోరు మీదనే ఉంటుంది.
విశాఖ ఉపాధి కల్పనలో కూడా ఇప్పుడు శరవేగంగా ముందడుగు వేస్తోంది. కొత్త ప్రభుత్వం విశాఖను సేవల రంగానికి చిరునామాగా మారుస్తోంది. సాఫ్ట్ వేర్‌తో పాటు ఆర్థిక సేవలు, టూరిజంలో నెంబర్ వన్ గా చేసేందుకు ప్రయత్నిస్తోంది. తమ రిటైర్మెంట్ జీవితం లేదా… ప్రశాంతమైన జీవితం కోసం అందరూ విశాఖ వైపు చూస్తున్నారు. ఈ మార్పులతో విశాఖలో ఏ మార్పులు రాకుండా… ప్రశాంతమైన .. వింటేజ్ విశాఖగానే ఉంటూ… అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు.
విశాఖలో దూరంగా బీచ్ కనిపిస్తూ ఉండేలా ఓ ఇల్లు కొనుక్కోవాలని ఆశపడని వ్యక్తి ఉండరు. సెలబ్రిటీలు కూడా అందులో ఉంటారు. అందుకే విశాఖ సెలబ్రిటీల డెస్టినేషన్‌గా కూడా మారుతోంది.