టీటీడీ బోర్డులో అదిత్ దేశాయ్ అనే వ్యక్తికి చోటు కల్పించారు. ఈయన ఎవరో తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. మాజీ బోర్డు సభ్యుడు కేతన్ దేశాయ్ కుమారుడు. ఈ కేతన్ దేశాయ్ ఎవరు అంటే… మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా చేసి అవినీతి కేసుల్లో అరెస్టు అయిన వ్యక్తి. అవినీతి చేసి రెండు సార్లు పదవులు పోగొట్టుకున్నారు. రెండు సార్లూ అవినీతి ఆరోపణల కారణంగానే. చాలా రోజులు జైల్లో ఉన్నారు.
ఇంత అవినీతి పరుడు టీటీడీలోకి రావడం ఏమిటని… హైకోర్టులో పిటిషన్లు కూడా పడ్డాయి. ఆ పిటిషన్పై జరిగిన విచారణలో హైకోర్టు ధర్మాసనం కూడా కేతన్ దేశాయిని పాలక మండలి సభ్యుడిగా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలాంటి చరిత్ర ఉన్న ఆయనకు టీటీడీ బోర్డు సభ్యత్వం ఇవ్వలేదు కానీ ఆయన కుమారుడికి ఇచ్చింది ప్రస్తుత ప్రభుత్వం. అంటే ఎంత పవర్ ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఈ అదిత్ దేశాయ్ కూడా వైద్య రంగంలోనే ఉన్నారు. జూనియర్ డాక్టర్ల సంఘాలను నడుపుతున్నారు. బీజేపీ పెద్దలకు ఆయన బాగా దగ్గర అన్న ప్రచారం ఉంది. అందుకే వైసీపీ అయినా టీడీపీ అయినా టీటీడీ బోర్డులో వారి పేర్లు ఉంటున్నాయంటున్నారు.
బీజేపీ కోటాలో రాష్ట్రం నుంచి ఒక్కరికీ ఇవ్వలేదు కానీ తమిళనాడు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో ఎక్కువ మంది బీజేపీ కోటానే. ఓ రకంగా చెప్పాలంటే సగం మంది బీజేపీ కోటాలోని వ్యక్తులే.