జగన్ రెడ్డి కడపు, పులివెందులకు వచ్చి మూడు రోజులు అయింది. అయితే కొద్ది మంది వైసీపీ నేతలు తప్ప ఆయన ఇంటి వద్ద ఎలాంటి సందడి కనిపించడం లేదు. కుటుంబంలో ఆస్తుల వివాదం కారణంగా అసలు జనం ఆయన ఇంటి వైపు రావడం లేదు. ప్రతీ సారి పార్టీ నేతలు అయినా పెద్ద ఎత్తున వచ్చేవారు. ఈ సారి వారు కూడా రావడం తగ్గించేశారు. దీంతో పులివెందులలోని ఆయన నివాసం వెలవెలబోతోంది.
అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఇప్పటికీ పలుమార్లు పులివెందుల పర్యటనకు వచ్చారు. క్యాంప్ కార్యాలయంలో ప్రజలను స్వయంగా కలవడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. దానికి ప్రజాదర్బార్ అని పేరు పెట్టారు. అధికారం పోయిన తర్వాత ప్రజాదర్భార్ ఎందుకు అని చాలా మంది పెదవి విరిచినా. … ఇప్పటికైనా ప్రజల్ని కలవకపోతే బాగుండదని ఆ పని పెట్టుకున్నారు. కానీ రిపీటెడ్ గా వచ్చిన వాళ్లే వస్తున్నారు కానీ కొత్తగా ఎవరూ కనిపించడం లేదు. జనం పలుచగా ఉండడం, మూడో రోజులు ఒకే రకమైన ముఖాలు కనిపిస్తూ ఉండడంతో జగన్ కూడా పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేసస్తున్నారు.
జగన్ చుట్టూ ఇప్పుడు ఎంపీ అవినాష్, డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి కడప మేయర్ సురేష్ బాబు వంటి వారు ఉంటున్నారు. వారు తీసుకు వచ్చిన జనంతోనే అక్కడ కూడా జనం ఉన్నారని అనుకుంటున్నారు. అలా వచ్చిన వారు గంట, రెండు గంటల్లో ో వెళ్లిపోతున్నారు. దీంతో జన సమీకరణకు ప్రయత్నాలు చేయాలని జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి నేతలు కూడా జగన్ ను కలిసేందుకు రాకపోవడం ఆ పార్టీ నేతల్ని ఆశ్చర్య పరుస్తోంది.