భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీయార్ ఇప్పుడల్లా ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన బయటకు రాకపోయే సరికి ఆయన ఆరోగ్యంపై చాలా మంది వాకబు చేస్తున్నారు. ట్విట్టర్ ఫ్యాన్స్‌తో కేటీఆర్ నిర్వహించిన చిట్ చాట్ లో కూడా చాలా మంది కేసీఆర్ ఆరోగ్యం గురించే వాకబు చేశారు. దానికి కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన ఆయన ఆరోగ్యం చాలా బాగుందని రోజూ తమకు రాజకీయంగా దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు.
2025 తర్వాత ఆయన నేరుగా ప్రజలలోకి వస్తారని కేటీఆర్ చెప్పారు. అంటే 2025లో కూడా రారని అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా గ్రౌండ్ ను కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించారు. ప్రభుత్వంపై పోరాటం మొత్తం ఆయనకే అప్పగించారు. కేటీఆర్ కూడా ఈ సవాల్ సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ నుంచి వచ్చే అన్ని సవాళ్లను ఎదుర్కొంటానని అంటున్నారు.
ప్రభుత్వంపై ఇప్పుడు ఎంత పోరాడినా పెరిగే వ్యతిరేకత పెరుగుతూనే ఉంటుందని.. అదే కేసీఆర్ ఇప్పుడే ఫీల్డ్ లోకి వస్తే ఎన్నికల సమయానికి అంతా రొటీన్ అవుతుందని అనుకుంటున్నారు. అందుకే పరిస్థితుల్ని అంచనా వేసుకుని ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇస్తే తిరుగు ఉండదని భావిస్తున్నారు. అదే సమయంలో మరో ఏడాదిలో కేసీఆర్ పేరు అందరూ మర్చిపోయేలా చేస్తానని రేవంత్ కూడా అంటున్నారు. అంటే రాబోయే రాజకీయం ఆసక్తికరమే అనుకోవచ్చు.