‘గేమ్ ఛేంజర్’ నుంచి దీపావళి సందర్భంగా ఓ పోస్టర్ వచ్చింది. రైలు పట్టాలపై రౌడీల్ని అడ్డంగా పడుకోబెట్టి, రామ్ చరణ్ క్లాస్ మాస్ వార్నింగ్ ఇస్తున్న షాట్ అది. ఈ పోస్టర్లో రామ్ చరణ్ లుంగీ లుక్ మాసీగా ఉంది. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన లుక్స్ లో ఇది బెస్ట్ లుక్ అని చెప్పుకోవొచ్చు. ఇప్పటి వరకూ చరణ్‌ని క్లాస్‌గానే చూపించారు. ఈ ఒక్క లుక్‌తో ఇక నుంచి అభిమానులు ఈ సినిమాని చూసే దృష్టికోణమే మారిపోవొచ్చు. శంకర్ మాస్ ఎలిమెంట్స్ బాగా తీస్తాడు. సరిగ్గా రాయాలే గానీ, విజువల్ గా అదరగొట్టేస్తాడు. అలాంటి సీన్లు గేమ్ ఛేంజర్‌లో ఎన్ని ఉంటాయ్ అన్నదాన్ని బట్టి, ఈ సినిమా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ‘గేమ్ ఛేంజర్’లో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంది. చాలా ఖర్చు పెట్టి, భారీ ఎత్తున ఆ సీన్ రూపొందించారు. ఆ ట్రైన్ ఎపిసోడ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందని టాక్. దీపావళికి వచ్చిన లుక్ కూడా ఆ ట్రైన్ ఎపిసోడ్ లోనిదే.
దీపావళికి ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఓ పాట వస్తుందని అంతా ఆశించారు. కానీ లుక్‌తో సరిపెట్టారు. కానీ ఆ లుక్ ఇచ్చిన ఇంపాక్ట్ పాట కంటే ఎక్కువగానే కనిపిస్తోంది. ఈనెల 9న ‘గేమ్ ఛేంజర్’ టీజర్ వస్తోంది. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ఈ టీజర్‌తో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో పలు రకాల లుక్స్‌లో కనిపించబోతున్నాడు. ఆ లుక్స్ అన్నీ.. ఈ టీజర్లో రివీల్ చేస్తారా, లేదంటే ట్రైలర్ వరకూ కొన్ని దాచుకొంటారా అనేది చూడాలి. గేమ్ ఛేంజర్ టీజర్‌ని ఓ ఈవెంట్ గా చేయబోతున్నారని తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’కు సంబంధించిన మొదటి ఈవెంట్ కాబట్టి, హైదరాబాద్ లోనే జరుపుతారని సమాచారం.