నెల్లూరు దశను మార్చేందుకు ఇద్దరు మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇస్తున్నాయి. పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరూ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చాలాకాలంగా తీరని కోరికగా ఉన్న దగదర్తి విమానాశ్రయాన్ని ఓ దారికి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామమోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉండటం కలసి వస్తోంది. దీంతో ఇప్పటికే అన్ని రాతకోతలు పూర్తి చేశారు. భూసేకరణ పనులు ప్రారంభించాల్సి ఉంది. వారంలో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఎయిర్పోర్టుకు టీడీపీ హయాంలో శంకుస్తాపన చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. పైగా అక్కడ భూములపై కన్నేసి అనువుగా ఉండదని తరలించాలని అనుకున్నారు. కానీ సాద్యం కాలేదు. ఇప్పుడుమళ్లీ టీడీపీ ప్రభుత్వం రావడంతో మంత్రి నారాయణ నేరుగా రామ్మోహన్ నాయుడుతో సంప్రదింపులు జరిపారు. భూమిని సమీకరిస్తే వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని కేంద్రమంత్రిగా హామీ ఇచ్చారు.
దగదర్తి విమానాశ్రయం ఆపరేషన్స్ లోకి వస్తే నెల్లూరు దశ మారుతుందని అనుకోవచ్చు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. నెల్లూరును ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయడానికి మంత్రులు ప్రయత్నిస్తున్నారు. సిటీ చుట్టూ ఉన్న రైస్ మిల్లుల్ని కృష్ణపట్నం పోర్టు లేదా సెజ్ లోకి మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాటిని తరలిస్తే సిటీ మరింతగా విస్తరిస్తుంది.