అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నారా లోకేష్ రెడ్ బుక్ పై మాట్లాడారు. మూడో చాప్టర్ తెరబోతున్నామని ఏం చెయబోతున్నామని వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావుల్ని అడగాలన్నారు. వారిద్దిరి గురించి పర్టిక్యులర్‌గా చెప్పారంటే.. కొడాలి నాని, వల్లభనేని వంశీ సంగతి చూడబోతున్నారని అనుకోవచ్చు. అయితే చాలా మందికి వచ్చిన డౌట్ మొదటి రెండు చాప్టర్లలో ఏం చేశారు అనే. ఆ రెండు చాప్టర్ల రిజల్ట్స్ ఏమయ్యాయని ?
రెడ్‌బుక్‌పై టీడీపీ క్యాడర్ అంచనాలు వేరే !
తెలుగుదేశం పార్టీ వైసీపీ హయాంలో ఎదుర్కొన్నన్ని ఇబ్బందులు మరెప్పుడూ ఎదుర్కోలేదు. కింది స్థాయి కార్యకర్త నుంచి చంద్రబాబు వరకూ అందరూ ఎదుర్కొన్నారు. మేము రాగానే అంతకు మించి చూపిస్తామని ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త మనసులో చాలెంజ్ చేసుకున్నారు. చంద్రబాబు కూడా జగన్‌కు మిసెరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని నిర్మోహమాటంగా ప్రకటించారు. అదే సమయంలో నారా లోకేష్ రెడ్ బుక్ టీడీపీ కార్యకర్తల్ని మరింత దైర్యం పెంచింది. అందుకే ఎన్నికల్లో వారు తెగించి పని చేశారు. దానికి తగ్గట్లే చర్యలు ఉండాలని వారు కోరుకున్నారు. కానీ అదికారం వచ్చిన నాలుగు నెలల్లో అంచనాలను అందుకోలేకపోయరన్న అసంతృప్తి క్యాడర్లో కనిపిస్తోంది.
చంద్రబాబులా లోకేష్ కాదు – కానీ మార్పేది !
చంద్రబాబు కక్ష సాధింపులకు వ్యతిరేకమని పార్టీలో నేతలందిరికీ తెలుసు. అధికారం వచ్చినా వైసీపీ నేతల్ని .. ఆయన ఏమీ చేయరని ఎక్కువ మంది అనుకున్నారు. పార్టీ క్యాడర్ లో ఉన్న భావనను లోకేష్ కూడా పసిగట్టారు.. బాబుగారు మంచి వాడే కానీ.. నేను ఆయనలా కాదని భరోసా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్‌లో ఇప్పటి వరకూ లోకేష్ మార్క్ కనిపించలేదు. రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని కొన్నాళ్లు చెప్పి తరవాత అమలు ప్రారంభమయిందన్నారు. ఇప్పుడు నేరుగా మూడో చాప్టర్ కు వెళ్లారు. రెండు చాప్టర్లలో అధికారులకు పోస్టింగులు ఇవ్వకపోవడం తప్ప.. పెద్దగా ఏమీ లేదు. అందుకే మూడో చాప్టర్ అయినా వైల్డ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ మార్పు లేదని టీడీపీ క్యాడర్ కోరుకుంటోంది.
చట్టబద్దంగానే ఇంకా దూకుడుగా ఉండలేరా ?
ఏమీ లేని… గాలి నుంచి ఫిర్యాదులు పుట్టించి రాత్రికి రాత్రి అరెస్టు చేసి టీడీపీ నేతల్ని చితకబాదేవారు పోలీసులు. చంద్రబాబును అరెస్టు చేశారు. అందరి కంటే ఎక్కువ వేధించింది తమ కుటుంబాన్నేనని తమకు మాత్రం ఉండదా అని లోకేష్ చెబుతున్నారు. ఎవరినైనా అరెస్టు చేయాలంటే రెండు నిమిషాల పని అంటున్నారు. నిజానికి ఎక్కువ మంది క్యాడర్ కూడా చంద్రబాబు కుటుంబాన్ని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కోరుకుంటోంది. అది వారి ఎమోషన్. నిజమే చట్టబద్దంగానే రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయాలి. వారు చేసిన ఎన్నో నేరాలు కళ్ల ముందు ఉన్నాయి. కానీ చర్యల కోసం ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్నది మాత్రం ఇర్థం కాని విషయం. క్యాడర్ ఫీడ్ బ్యాక్ లోకేష్ వరకూ చేరుతుందో లేదో మరి !