ప్రభాస్ తో సినిమా చేయాలని అందరి దర్శకులకి ఉంటుంది. ఆయన కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన వున్న బిజీలో మరో కొత్త సినిమా చోటు దక్కడం కష్టం. ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ఇద్దరి దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేరని వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి.
దర్శకులు లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ, ప్రభాస్ తో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తోందని ఓ వార్త తిరుగుతోంది. నిజానికి లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ వర్మ ఇద్దరూ క్రేజీ డైరెక్టర్లే. పాన్ ఇండియా సినిమాలు విజయవంతంగా తీర్చిదిద్దగల సమర్ధులు. అయితే ఈ ప్రాజెక్ట్స్ చేయడానికి ప్రస్తుతం ప్రభాస్ దగ్గర అంత సమయం ఉందా అనేది ప్రశ్న.
ప్రభాస్ పూర్తి చేయాల్సిన సినిమాల లిస్టు పెద్దదే. రాజా సాబ్ ఇంకా పూర్తి కాలేదు. సలార్2, కల్కి 2 చేయాలి. హను రాఘవపూడి ఫౌజి వుంది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్ళాడని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ పూర్తి కావడానికి ఏళ్ళ సమయం పడుతుంది. అప్పటివరకూ ప్రభాస్ మరో సినిమాకి సమయం కేటాయించే అవకాశం ఏ మేరకు ఉంటుందో చూడాలి.