రుషికొండ ప్యాలెస్ మీద అంతకు ముందు చాలా కొద్ది స్థలంలో టూరిజం కాటేజీలు ఉండేవి. ఏడాదికి రూ.పాతిక కోట్ల ఆదాయం వచ్చేది. కూలగొట్టడానికి ఏడాది ముందే దాదాపుగా రెండుకోట్లు పెట్టి రిపేర్లు చేయించారు. పర్యవరణానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వాటిని నిర్మించారు. కానీ జగన్ రెడ్డి అక్కడ వాటిని కూలగొట్టారు. ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ ను కట్టించుకున్నారు. ప్రజలు తన బానిసలని వారికి రూ. పది పడేస్తున్నారు కాబట్టి ఓటేస్తారని ఆయన అనుకున్నారు. కానీ పాతాళంలో పడేశారు. ఇప్పుడు రుషికొండ విధ్వంసం, ప్రజాధనం దుర్వినియోగానికి శిక్ష ఏమిటి?
ఏటా పాతిక కోట్ల ఆదాయం లాస్ – రూ.500 కోట్లు అదనపు ఖర్చు
టూరిజం కాటేజీల ద్వారా పర్యాటకశాఖకు వచ్చే పాతిక కోట్ల ఆదాయాన్ని పోగొట్టారు. ఇప్పుడు రుషికొండపై రూ. ఐదు వందల కోట్లు ఖర్చు చేసి భవనం నిర్మించారు. నాలుగేళ్లలో వంద కోట్ల నష్టంతో పాటు మరో ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టారు. అంటే కనీసం ఏటా యాభై కోట్లు ఆదాయం వచ్చేలా ఈ నిర్మాణం ఉండాలి. కానీ ఇప్పుడు కట్టిన ఇళ్ల వల్ల ఎలాంటి ఆదాయం వస్తుందో ఎవరైనా చెప్పగలరా?. జగన్ రెడ్డి తనతో పాటుతో తన ఇద్దరు పిల్లలుఉండేలా మూడు ప్యాలెస్‌లతో పాటు తన పనివాళ్లు ఉండేందుకు మరో నాలుగు బిల్డింగులు కట్టించారు. వీటిని అలా హోటల్ గా వాడుకోలేరు.. కనీసం కన్వెన్షన్ సెంటర్ గా కూడా వాడుకోలేరు.
పర్యావరణ విధ్వంసం క్షమించరాని నేరం
రుషికొండ విశాఖ కు సెక్యూరిటీ లాంటిది హుదూద్ వచ్చినప్పుడు ఈ కొండ వల్లే ఎంతో నష్టం తగ్గింది. లేకపోతే విశాఖ తుడిచి పెట్టుకుపోయేదని చెబుతారు. అంతే కాదు ఇలాంటి వాటిని రక్షించడానికి సీఆర్‌జెడ్ నిబంధనలు. ఉన్నాయి. కానీ దేన్నీ ప్రభుత్వం లెక్క చేయలేదు. ఎంతగా అంటే కోర్టులు చెప్పినా తగ్గలేదు. చేయాలనుకున్నది చేసేశారు. విధ్వంసం పూర్తయ్యాక కానీ అసలు ఆయన చేసిన ఘోరం ఏమిటో ప్రపంచానికి అర్థం కాలేదు.
ప్రజాధనంతో ఆ విలాసాలు ఎలా ?
రుషికొండ ప్యాలెస్ ను ఐదు వందల కోట్లు పెట్టి నిర్మించారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో నాలుగు వందల కోట్లు కూడా ఇవ్వలేదు. మొత్తం గ్రామ పంచాయతీలకూ అంత నిధులు ఇవ్వలేదు. ఒక్కడి విలాసం కోసం ఎంత ఘోరమైన తప్పులకు పాల్పడ్డారో ఇదే ఉదాహరణ. ఒక్క ఫ్యాన్ మూడు లక్షలు.. ఒక్క కమోడ్ ఇరవై లక్షలు…. బాత్ టబ్ నలభై లక్షలు … ఇలా ఎవరబ్బ సొమ్ము ?. తాడేపల్లిలో సొంత ఇంటి కోసం ఆయన కనీసం వంద కోట్ల ప్రజాధనం వృధా చేశారు. రుషికొండలో క్షమించరాని నేరం చేశారు. దీనికి శిక్ష ఏమిటి ?