వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి చాలా దూకుడుగా ఉన్నారు. జగన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఆయన హయాంలో తాను మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నా.. వాళ్లు చెప్పినట్లుగానే రాజకీయం చేసి బ్యాడ్ అయిపోయానని క్షమించాలని చంద్రబాబును నేరుగానే మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు కూడా. వైసీపీలో చేసినవన్నీ ఆ పార్టీ చెప్పినట్లుగా చేశానని ఆమె క్లారిటీ ఇచ్చారు. తన అసలు రాజకీయం ఎలా ఉంటుందో అని.. రాజీనామా లేఖ ఇచ్చినప్పటి నుంచి చూపిస్తూనే ఉన్నారు.
జగన్ రెడ్డిపై, వైసీపీపై వాసిరెడ్డి పద్మ విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమే గోరంట్ల మాధవ్ తో పాటు సాక్షి పత్రికపై కేసులు నమోదు చేయించారు. అత్యాచారం బాధితురాలి పేర్లు వెల్లడించడం చట్టప్రకారం నేరం. గోరంట్ల మాధవ్ ఆ పని చేయడం..సాక్షి ప్రసారం చేయడంతో నేరుగా బెజవాడ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి కేసులు పెట్టించారు. వారంలో ఏ పార్టీలో చేరుతాననేది ప్రకటిస్తానన్నారు. విజయవాడ ఎంపీ తమ కుటుంబానికి ఎంతో ఆప్తులన్నారు.
కేశినేని చిన్నితో ఇప్పటికే వాసిరెడ్డి పద్మ చర్చలు జరిపి ఉంటారని భావిస్తున్నారు. పార్టీ వాయిస్ ను బలంగా వినిపించే ఓ మహిళా నేత కోసం టీడీపీ చూస్తోంది. వంగలపూడి అనిత హోంమంత్రి అయ్యారు. కడప ఎమ్మెల్యే మాధవి కూడా బాగా మాట్లాడతారు ఆమెకు కడప బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తిగా పార్టీ కోసం మాట్లాడే మహిళా నేత అవసరం కాబట్టి వాసిరెడ్డి పద్మను టీడీపీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.