నారా లోకేష్ ఒక్క జూమ్ కాల్ మీటింగ్తో లక్షా నలభై వేల కోట్ల పెట్టుబడులను ఫైనల్ చేశారని ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆర్సెలార్ మిట్టర్ ఏపీలో పెట్టుబడులకు ఏర్పాట్లు చేస్తోందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆర్సెలార్ తో పాటు నిప్పన్ స్టీల్స్ కంపెనీ జాయింట్ వెంచర్ గా ఏర్పడి ఈ పరిశ్రమను పెట్టబోతున్నాయి. రెండు విడతలుగా లక్షా నలభై వేలకోట్లను పెట్టుబడిగా పెడతాయి.
తీర ప్రాంతంలో స్థలంతో పాటు ఎగుమతులు, దిగుమతుల కోసం ఓ ప్రైవేటు జెట్టీ ఉన్న ప్రాంతం కోసంతాము అన్వేషించామని ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రతినిధి ఎకనమిక్ టైమ్స్ కు తెలిపారు. ఒడిషాతో పాటు ఏపీలోనూ పలు ప్రదేశాలు పరిశీలించామన్నారు. ఏపీలోని కక్కపల్లి ప్రాంతం అనువుగా ఉందన్నారు. అక్కడ ఇప్పటికే ఫార్మాకు చెందిన పరిశ్రమల కోసం సేకరించిన భూములు ఉన్నాయి. మరికొద్దిగా సేకరిస్తే సరిపోతుంది. కంపెనీకి సౌకర్యంగా ఉండటంతో ఆర్సెలార్ మిట్టర్ యజమాని ఆదిత్య మిట్టల్తో లోకేష్ ఒక్క జూమ్ కాల్లో మాట్లాడారని పెట్టుబడులకు అంతా సిద్ధమైపోయిందని ఎకనమిక్స్ టైమ్స్ తెలిపింది.
ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టీల్ ఉత్పత్తిదారులు. ఉత్పత్తి చేసే దాంట్లో అత్యధిక ఎగుమతి చేస్తారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్రను ఆర్థికంగా మరింత బలోపేతం చేయనుంది. ఈ ఏడాదిలోనే ఒప్పందాలు పూర్తయిపోయి.. పరిశ్రమ నిర్మాణ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. 2029 నాటికి తొలి దశ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ దాస్ పాయ్ షేర్ చేశారు. ఏపీకి పెద్ద విజయం అన్నారు.