హిందీ చిత్ర పరిశ్రమవల్లనే గుజరాతీ, భోజ్ పురి, మరాఠీ, హర్యానీ, బిహారీ, పంజాబీ చిత్ర పరిశ్రమలు ఎదగలేదని తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ ఆరోపించారు. కేరళలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన అక్కడ ప్రసంగించారు. హిందీ చిత్ర పరిశ్రమపై మండిపడ్డారు. దక్షిణాదిలో ప్రతీ రాష్ట్రంలోనూ చిత్ర పరిశ్రమలు బలబడ్డాయని మంచి సినిమాలు వస్తున్నాయన్నారు. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలు అభివృద్ది చెందాయాలంటే దానికి కారణం హిందీ ప్రభావం లేకపోవడమేనన్నారు. ఉత్తరాది భాషల్లో సినీ పరిశ్రమలు బాలీవుడ్ కారణంగా అభివృద్ధి చెందలేదన్నారు.
డీఎంకే భావజాలంలో హిందీ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. హందీని తమ మీద రుద్దవద్దని అంటూనే ఉంటారు. సెంటిమెంట్ రేపుతూనే ఉంటారు. ఈ వ్యతిరేకత బీజేపీ వల్ల వచ్చింది కాదు. బీజేపీ లేనప్పుడు కూడా తమిళనాడులో హిందీ వ్యతిరేత ఉద్యమాలు జరిగాయి. ఆ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనా ఉంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ ఎప్పుడూ చొచ్చుకు రాలేదు. అయితే వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ అన్నట్లుగా అందరిపై హిందీని రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే డీఎంకే తరచూ ఆరోపణలు చేస్తోంది.
బాలీవుడ్ కారణంగానే గుజరాతీ, భోజ్ పురి, మరాఠీ, హర్యానీ, బిహారీ చిత్ర పరిశ్రమలు ఎదగలేదని ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేదు. కానీ అన్ని రాష్ట్రాల్లో హందీ సినిమాలే మెయిన్ ఎంటర్టెయిన్ మెంట్. హిందీ మాట్లాడే భాషలు కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ చిత్ర పరిశ్రమలు ఉన్నాయి. ముంబైలో మరాఠీ సినిమాలు కూడా నిర్మితమవుతాయి. కానీ అన్నీ బాలీవుడ్ నీడలోనే ఉంటున్నాయి. ఉదయనిధి చెప్పిన అన్ని భాషల్లోనూ ఇప్పుడు సినిమాలు నిర్మితమవుతున్నాయి. హిందీ నీడను తప్పించుకుని ఎదుగుతాయో లేదో ముందు ముందు స్పష్టత వస్తుంది.