రుషికొండ ప్యాలెస్ నిర్మాణాన్ని ఎలా సమర్థించుకోవాలో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే చిత్రమైన లాజిక్కులు తీసుకు వస్తున్నారు. మాయన్న మాస్టర్ పీస్ కట్టించాడని చెప్పుకుంటున్నారు. ఆదాయం వచ్చే కాటేజీల్ని కూల్చేసి… పర్యావరణ విధ్వంసం చేసి..ఓ ప్యాలెస్ కట్టుకుంటే… అది మాస్టర్ పీస్ అంటున్నారు. అసలు అది ఎందుకు ఉపయోగపడుతుందో ఒక్కరూ చెప్పడం లేదు. జగన్ రెడ్డి తనను తాను రాజుగా ప్రకటించేసుకుని ప్రజలంతా పిచ్చోళ్లని తీర్మానించుకుని .. తనకు ఎప్పుడూ కుర్చీ అతుక్కుని ఉంటుందని ఆ ప్యాలెస్ నిర్మించుకున్నారు.
అందులో పెట్టిన ప్రతి ఒక్క రూపాయి… ఆ నిర్మాణం పేరుతో దోచేసిన ప్రతి ఒక్క రూపాయి ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నదే. అంతేనా అలా కట్టడం వల్ల అంతకు ముందు ఉన్న కాటేజీని కూల్చేయడం వల్ల జరిగిన నష్టం కోట్లలోనే ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోవడం లేదు. తమ నేత ఏదో తాజ్ మహల్ కట్టించాడని చెప్పుకుంటున్నారు. సొంత డబ్బులతో తాజ్ మహల్ కట్టించుకోవడం విషయం.. కానీ ప్రజాధనం దుర్వినియోగం చేసి కట్టుకోవడం కాదు. భావితరాలకు నష్టం చేసి కాదు. అయినా దీన్ని అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారంటే అది బరితెగింపు కూడా కాదు అంత కంటే ఎక్కువ.
సీఎం క్యాంప్ ఆఫీసు కోసం చేసిన నిర్వాకం ఆయనకు ప్రజలు మరోసారి ఓటు వేయాలంటే భయపడేలా చేయడం ఖాయం. ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజాధనం వెచ్చించి కొన్ని ఫర్నీచర్ దగ్గర నుంచి ఉన్న ప్రభుత్వ ఆస్తులను ఇచ్చేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకోవడానికి… సాక్షికి .. భారతి సిమెంట్స్ కు ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి తప్ప … . పరిపాలన ఇక దేనికీ చేయలేదు. అలాంటి డబ్బులతో కూలీ ఇచ్చి సోషల్ మీడియాలో పొగిడించుకుంటున్నారు.