సోషల్ మీడియలో ”వాట్సప్”మొదలైన వన్ టు వన్ లేదా వన్ టు గ్రూప్ కమ్యూనికేటివ్ సాధనాలను నిషేధించాలా లేక నియంత్రించాలా అనే విషయం మీద జూన్ 29 న సుప్రీంకోర్టు విచారణ ప్రారంభిస్తుంది.
ఆయా మీడియాలు తమ సబ్ స్క్రైబర్ లు / యూజర్ల ప్రయివెసీని కాపాడటానికి లో భాగంగా ఈ నెట్ వర్క్ లలో మెసేజీలను ఒక కోడ్ లోకి ”ఎన్ క్రిప్ట్” చేస్తాయి. సెక్యూరిటీ కీ / పాస్ వర్డ్ తోనే అది తెరుచుకుంటుంది. ఎన్ క్రిప్షన్ వల్ల మెసేజ్ పంపేవారికి చదువుకునేవారికీ తప్ప అందులో ఏముందో మూడో మనిషికి తెలియదు. ఈ టెక్నాలజీని టెర్రరెస్టులు వుపయోగించుకుంటున్నారని ప్రతీ సంఘటనలోనూ బయటపడుతోంది. మెసేజీలను డీక్రీప్ట్ చేయడం పోలీసు, నిఘాబృందాలకు అసాధ్యమో కష్టసాధ్యమో అవుతున్నాయి.
దేశభద్రత రీత్యా ఎన్ క్రిప్టెడ్ మెసేజీలు పంపుతున్న వాట్సప్ – వైబర్ – టెలిగ్రామ్ – హైక్ – సిగ్నల్ మొదలైన ప్రయివేట్ మెసెంజర్ల నెట్ వర్క్ లను నిషేధించాలని హర్యానాలోని ఒక సోషల్ యాక్టివిస్ట్ సుధీర్ యాదవ్ సుప్రీంకోర్టులో ”పిల్’ (పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటీషన్) వేశారు. ”ఈ సామాజిక సందేశాల అప్లికేషన్లు దేశ భద్రతకు చేటు” అంటున్న ఈ పిల్ మీద 29న కోర్టు విచారిస్తుంది.