తెలంగాణ వ్యాప్తంగా మాజీ సర్పంచ్లు తమకు పెండింగ్ బిల్లులు ఇప్పించాలంటూ ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో చాలా మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు వచ్చారు. హరీష్ రావు కూడా వెళ్లారు. అయితే అ మాజీ సర్పంచ్లు అంతా ఎవరు ?. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. వారు చేసిన పనులు కూడా బీఆర్ఎస్ హయాంలో చేసినవే. సర్పంచులకు బిల్లులు ఎగ్గొట్టింది కూడా బీఆర్ఎస్ సర్కారే. ఇప్పుడు వారికి బిల్లులు ఇవ్వాలంటూ ఆందోళన చేస్తోంది కూడా బీఆర్ఎస్సే.
బీఆర్ఎస్ హయాంలో సొంత పార్టీ సర్పంచ్లను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నాటికైనా చెల్లిస్తారనుకుంటే వవఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లారు. ఓడిపోవవడంతో వారికి ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. బిల్లుల కోసమే కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రయారిటీలు వేరే ఉన్నాయి. బీఆర్ఎస్ క్యాడర్ కు ఆర్థిక ప్రయోజానాలు కల్పించడం వారి జాబితాలో లేదు. అయితే సర్పంచుల ఆందోళనకు విస్తృత ప్రచారం లభించింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఆలస్యంగా ఎదరుదాడికి దిగారు. మీరే పెండింగ్ పెట్టి మీరే ఎదుుదాడికి దిగుతారా అని మండిపడ్డారు. ఎవరికీ అన్యాయం చేయబోమని మార్చి నెలాఖరులలోపు చెల్లిస్తామని అంటున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ తమ పాలనలోని వైఫల్యమే అయినా ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలకు ఉపయోగించుకుంటోంది.