కెనడా ప్రధాని జస్టిన్ ట్రెడావు తన దేశంలో ఇండియన్స్ మధ్య చిచ్చు పెట్టానని అనుకుని ఇండియాను ఏదో చేసేస్తున్నానని అనుకుంటున్నారు. నిజానికి ఆయన తన దేశానికే నిప్పు పెట్టుకుంటున్నానన్న సంగతిని మర్చిపోతున్నారు. ఖలిస్థాన్ సపోర్టర్లను హిందువుల మీదకు ఎగదోస్తున్నారు. వారిపై దాడులకు ప్రోత్సహిస్తున్నారు. కెనడాలో హిందువులపై జరిగిన దాడులకు ట్రెడావు అనుమతి ఉందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఆయన మద్దతు లేకపోతే ఇలాంటి జాతి వివక్ష ఘటనలు జరగడానికి అవకాశం ఉండదని అంటున్నారు.
ఖలిస్థానీలకు హిందువులను ఎందుకు శత్రువులుగా చూస్తున్నారో ఎవరికీ తెలియదు. ఖలీస్థాని విషయంలో హిందువులు జోక్యం చేసుకోలేదు. కానీ సిక్కుల్లోనే ఖలీస్థానీ ఉద్యమన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు. మాఫియా, నేర సామ్రాజ్యం, నేర పూరిత వ్యాపారాలు చేసేవారు మాత్రమే ఖలిస్థానీవాదులుగా ఉన్నారు. వారిని చూసి భయపడి ఖలిస్థానీలకు మద్దతు తెలిపేలా చేసుకుటున్నారు. దీనికి కెనడా ప్రభుత్వం మద్దతు ఉండటంతో రెచ్చిపోతున్నారు.
పాముకు పాలుపోస్తే అది తమనే కాటు వేస్తుందనే సంగతిని ప్రపంచ దేశాలు ఇప్పటికే అనుభవిస్తున్నాయి. టెర్రరిజాన్ని, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించిన దేశాల్లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ చూస్తునే ఉన్నారు. అయితా ఊడిపోతున్న తన పదవిని నిలుపుకునేందుకు ట్రెడావు దేశానికే అగ్గి పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇది కెనడియన్లకు గడ్డు కాలమే.