హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నేల చూపులు చూస్తోంది. దీనికి కారణం బడా ప్రాజెక్టులపై హైడ్రా ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్న ఆందోళన. అలాగే వడ్డీ రేట్ల ప్రభావం కూడా ఎక్కువే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదురుగా ఉన్న ప్రాంతం కొంపల్లి. మధ్యతరగతి ప్రజల ఆశలు నేరవేర్చాలా అక్కడ ఇళ్లు అందుబాటులో ఉండటమే దీనికి కారణం.
సికింద్రాబాద్, కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఎప్పుడో మధ్యతరగతి వారికి అందకుండా పోయాయి. అందుకే ఎక్కువ మంది చూపు కొంపల్లి వైపు పడుతోంది. నాగ్పూర్ జాతీయ రహదారి, కరీంనగర్ రహదారి చుట్టుపక్కల జోరుగా నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. సుచిత్ర, కొంపల్లి, బొల్లారం ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్ వెంచర్లు మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల వెలుస్తున్నాయి.
కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో.. డబుల్ బెడ్రూం ఫ్లాట్ 60 లక్షల నుంచి మొదలు 80 లక్షల వరకు దొరుకుతుంది. కాస్త లగ్జరీగా పెట్టుకోవాలనుకునేవారికి కోటి లోపే తమ ఆలోచనకు తగ్గ ఇల్లు దొరుకుతుంది. ఇటీవలి కాలంలో కొంపల్లి నుంచి ఐటీ కారిడార్ సహా అనేక ప్రాంతాలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టు మెరుగుపడింది.