అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తోంది. ఈ క్రమంలో అమెరికాలో పోలింగ్ పూర్తయిన చోట కౌంటింగ్ కూడా జరుగుతోంది. ఇప్పటి వరకూ వెల్లడి అయిన ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అయితే అది ఏకపక్షంగా కాదు. రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో అనుకూలమైన ఫలితాలను సాధిస్తూ వస్తున్నారు. అదే సమయంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ తమకు పట్టున్నా రాష్ట్రాల్లో విజయం సాధించారు.
తాజా సమాచారం మేరకు ట్రంప్‌కు 177 ఎలక్టోరల్ ఓట్లు లభించగా.. కమలా హ్యారిస్ 99 దగ్గర ఉన్నారు. అత్యంత కీలమైన రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. 270 ఎలక్టోరల్ ఓట్లు వస్తేనే అమెరికా అధ్యక్ష పదవి లభిస్తుంది. ట్రెండ్స్ భారత్లోఎన్నికల్లా ఉండవు. అమెరికా అధ్యక్ష ఎన్నిక పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఓ రాష్ట్రంలో పూర్తి ఆధిక్యత సాధిస్తే ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లు అన్నీ ఆ పార్టీకే వస్తాయి. అందుకే అమెరికా మొత్తం మీద పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చిన అభ్యర్థే అధ్యక్షుడు అవ్వలేరు. ఎలక్టోరల్ ఓట్లే కీలకం.
స్వింగ్ స్టేట్స్ గా అంచనా వేస్తున్న ఐదారు రాష్ట్రాల ఫలితాలే అధ్యక్షుడ్ని నిర్ణయించబోతున్నాయి. ప్రతీ సారి ఎన్నికల సమయంలో ట్రెండ్స్ లో రిపబ్లికన్లకే ఆధిపత్యం కనిపిస్తుంది. బెట్టింగ్ మార్కెట్లు మాత్రం పూర్తి స్థాయిలో ట్రంప్ కు అనుకూలంగా ఉన్నాయి. ఆయన గెలుస్తారని ఎక్కువ మంది పందేలు కడుతున్నారు. కమలా హ్యారిస్ గెలుస్తారని పందేలు కట్టేవాళ్లు తక్కువగా ఉన్నారు. ఫలితాలపై ఇవాళ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.