ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. హోంమంత్రి అమిత్ షాతో ఆయన మీటింగ్ షెడ్యూల్ ఖరారు అయింది. ఇంత హఠాత్తుగా పవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపురావడం రాజకీయ వర్గాల్లోన ఆసక్తి రేపుతోంది.
హోంమంత్రిత్వ శాఖ, హోంమంత్రి అనితపై ఆయన. చేసిన వ్యాఖ్యలు రాజకీయదుమారాన్ని రేపాయి. వైసీపీకి ఓ అస్త్రం ఇచ్చినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో కూటమి మధ్య విబేధాలు వచ్చాయంటూ జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ఓ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటూ పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసాధారణమని .. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత పార్టీల మధ్య గ్యాప్ లేదని అనుకోలేమని జాతీయ స్థాయిలో రాజకీయ చర్చలు జరిగాయి. ఇవన్నీ అమిత్ షా దృష్టిలో పడ్డాయేమో కానీ ఆయనను ఢిల్లీకి పిలిపించినట్లుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ అలా మాట్లాడటానికి కారణం ఏమిటి.. కూటమి పాలనలో ఏం జరుగుతోందని పవన్ భావిస్తున్నారు లాంటి అంశాలపై అమిత్ షా అభిప్రాయాలు తెలుసుకుంటారని అంటున్నారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటూ పోలీసుల పనితీరుపై ర్యాండమ్ గా అలాంటి ఆరోపణలు చేస్తే వారి స్థైర్యాన్ని దెబ్బతీసినట్లు అవుతుందని ఏదైనా స్పెసిఫిక్ గా ఓ కేసు గురించి చెప్పడం వేరు.. పోలీసులు ఇంకా వైసీపీ మాయలోనే ఉన్నారని ఆరోపించడం వేరని భావిస్తున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాకు ఎప్పటికప్పుడు రాష్ట్రాలపై నివేదికలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ను పిలిచి మాట్లాడాలని భావించారని అందుకే ఆయనకు ఆహ్వానం పంపారని భావిస్తున్నారు.