జగన్ రెడ్డిపై ప్రజల్లో ఎంత మాత్రం విశ్వాసం ఉందో నిరూపించే ఘటన ఇది. తన కుమారుడు తనపై హత్యాయత్నం చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకు విజయలక్ష్మి వీడియో విడుదల చేశారు. ఆస్తుల విషయంలో ఎన్ని వివాదాలు వచ్చినా జగన్ రెడ్డి తన కుమారుడేనని ఆమె చెప్పుకున్నారు. రెండు రోజుల కిందట రిలీజ్ చేసిన లెటర్ తాను రాసిందేనన్నారు. అంతకు ముందు రాసింది కూడా తాను రాసిందేనన్నారు. రెండు లేఖలు తానే రాశానని విజయమ్మ క్లారిటీ ఇచ్చారు.
అంటే.. ఆస్తుల వివాదంలో జగన్ రెడ్డి తప్పు చేశారని చెప్పడంతో పాటు.. తనపై హత్యాయత్నం చేయలేదని .. జగన్ రెడ్డి అలా చేయలేదని రిలీజ్ అయిన రెండు లెటర్లు విజమయ్మే రాశానని ఆమె స్వయంగా వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. ఎందుకిలా చేయాల్సి వచ్చిందో వైసీపీ నేతలు ఒక్క సారి ఆలోచిస్తే జగన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఏమిటో అర్థమైపోతుంది. సొంత తల్లిపై హత్యాయత్నం చేస్తారంటే.. ప్రజలు నమ్ముతారని ఆయన భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఇమేజ్ అలాంటిది మరి.
తల్లిపై జగన్ హత్యాయత్నం చేశారంటూ టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తే దాన్ని ఖండించుకోవడానికి వైసీపీ నానా తంటాలు పడింది. విజయమ్మతో లేఖ విడుదల చేయిస్తే దాన్ని ఎవరూ నమ్మలేదు. తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి డిలీట్ చేయడంతో మరింత సమస్య వచ్చింది. సంతకం తేడా ఉండటమే దీనికి కారణం.
విజయమ్మ వీడియో అసలుకే జగన్ రెడ్డి ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉంది. కుమారుడి ఒత్తిడితో ఆమె ఏం చెప్పినా… తాడేపల్లికి వెళ్లేందుకు విజయమ్మ ఏ మాత్రం ఆసక్తిగా లేరని ఎప్పుడో స్పష్టమయింది. నాలుగేళ్ల నుంచి విజయమ్మ జగన్ ఇంటికి వెళ్లలేదు. జగన్ కూడా ఎప్పుడూ ఆమెను చూసేందుకు షర్మిల ఇంటికి వెళ్లలేదు. వైఎస్ జయంతి వర్థంతుల సందర్భంగా పులివెందులలో కలవడం మాత్రమే జరుగుతోంది.