కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కోసం శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే రాజ్యాంగ సవరణలు తప్ప మిగతా అంతా ప్రక్రియ పూర్తయిపోయింది. పార్లమెంట్లో బిల్లు పెట్టి ఉభయసభల్లో వాటికి కావాల్సిన రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయాలి. ఇందు కోసం ఈ నెలలోనే రాజ్యాంగసవరణ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉభయసభల సంయుక్త సమావేశాలను ఇందు కోసమే ఏర్పాటు చేసినట్లుగా భావిస్తున్నారు.
అసలు ఈ వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై కేంద్రం వ్యూహమేంటి అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ముఖ్యంగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ను నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల రాష్ట్రాల అసెంబ్లీ పరిధిని పెంచాలి.., మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీల పరిధిని తగ్గించాలి… అలా చేయడానికి ఆయా రాష్ట్రాలు కూడా అంగీరించాల్సి ఉంటుంది. రాజ్యాంగసవరణ కూడా ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం పద్దెనిమిది అంశాలపై రాజ్యాంగసవరణ చేయాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. ఇందు కోసం మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. ఉభయసభల్లోనూ ఎన్డీఏకు అంత మెజార్టీ లేదు.
కానీ ఉభయసభల సంయుక్తు సమావేశం ఏర్పాటు చేస్తే.. మద్దతిచ్చే వారితో కలుపుకుంటే అవసరమైన మెజార్టీ వస్తుందని లెక్కలేసుకున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఇరవై ఐదో తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సంయుక్త సమావేశాల్లో. రాజ్యాంగసవరణలు ప్రతిపాదించి ఆమోదించుకుని. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ను వచ్చే ఎన్నికల నుంచి చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.