వైసీపీ సోషల్ మీడియా సైన్యాన్ని వైఎస్ జగన్ బలిచ్చేయడానికి రెడీ అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఎంత ఘోరంగా విపక్ష నేతల్ని తిడితే అంత గొప్ప ప్రమోషన్లు అని.. ప్రజాధనం జీతాలుగా ఇచ్చి పెట్టుకున్న వారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అధికార పార్టీ నేతల్ని అమ్మలక్కలు తిట్టండి.. మేం చూసుకుంటామని భరసా ఇచ్చారు. ఇప్పుడు వారి పరిస్థితి ఘోరంగా మారింది.
పోలీసులు పెడుతున్న వరుస కేసులతో సోషల్ మీడియా కార్యకర్తలు తలోదిక్కుకుపారిపోయారు. అనేక మంది అరెస్టు అవుతున్నారు. జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అయిన తన కార్యకర్తలను కాస్త సంయమనంగా ఉండండి.. అని పిలుపునిచ్చిన పాపాన పోలేదు.కానీ రెచ్చిపోండి.. మేము న్యాయ సహాయం చేస్తామని అన్నారు. ఇది మరింత ఘోరమైన పిలుపుగా మారింది. ప్రభుత్వం నాలుగు నెలల పాటు వేచి చూసింది. కానీ రోజు రోజుకు చేతకానితనంగా ఊహించుకుని రెచ్చిపోయారు. ఫలితంగా ఇవాళ అందరూ జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. గగ్గోలు పెట్టినా.. లాయర్లను పెట్టినా ప్రయోజనం ఉండదు.
పోలీసుల్ని ఎలా వాడుకోవాలో జగన్ రెడ్డి చూపించారు. జగన్ రెడ్డి అందులో డిగ్రీ చేస్తే.. కూటమి ప్రభుత్వం పీహెచ్డీ చేస్తుంది. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించి చర్యలు తీసుకుంటుంది. అప్పుడు కనీస వ్యతిరేకత రాదు కదా.. ఈ సైకోల్ని అలా వదిలేస్తే ఎలా అని ప్రజలే ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడెవరూ మాట్లాడటం లేదు. కళ్లం హరికృష్ణారెడ్డి అనే కార్యకర్త… జగన్ రెడ్డి బాగానే ఉంటారు.. మనమే బలైపోతాం.. ఫేక్ పోస్టులు పెట్టమాకండి అని తాజాగా సెలవిచ్చారు. కానీ ఇప్పటికే చేయిదాటిపోయింది.