ఉద్యోగం పేరుతో డబ్బులు తీసుకుని అత్యాచారం కూడా చేశారంటూ తాడేపల్లి పోలీసులకు ఓ మహిళ మాజీ మంత్రి మెరుగు నాగార్జునపై ఫిర్యాదు చేసింది. దీనిపై ఆయన ఉలిక్కి పడ్డారు. ఇదంతా కుట్ర అన్నారు. ఏ కుట్ర చేశారో కానీ ఆ ఫిర్యాదు చేసిన మహిళతో రాజీకి వచ్చారు. దీంతో ఆమె హైకోర్టులో తాను తప్పుడు ఆరోపణలు చేశానని కేసును కొట్టి వేయాలని కోరింది.కానీ న్యాయమూర్తి మాత్రం ఇదేమైనా పిల్లల ఆటా.. ఫిర్యాదులు చేసి.. మళ్లీ కోర్టులో విత్ డ్రా చేసుకుంటామనడం ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు ఫిర్యాదు అయితే ఫిర్యాదుదారుపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
దీంతో ఇప్పుడు ఫిర్యాదు దారు కూడా ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. మెరుగు నాగార్జునతో ఆ మహిళ లావాదేవీలు నిజమని ఆయనతో సన్నిహితంగా ఉన్న వారికి.. వైసీపీ నేతలకు తెలుసు. వారి మధ్య ఎలాంటి బంధం ఉందో కానీ అది బెడిసి కొట్టింది. మెరుగు నాగార్జున చేసిన ప్రామిస్లు నెరవేర్చకుండా తప్పించుకు తిరిగారు. ఇటీవలి కాలంలో బెదిరించారు. దీంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు. ఇది చాలా పెద్ద కేసు అయ్యే ప్రమాదం ఉండటంతో మెరుగు నాగార్జున మళ్లీ కాళ్ల బేరానికి వెళ్లారు. అన్నీ చేస్తాను.. ఇస్తాను.. ముందుగా కేసును విత్ డ్రా చేసుకోవాలని బేరానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే పై కూడా ఇలాంటి ఆరోపణల్ని ఓ మహిళ చేసింది. తర్వాత తాను తప్పుడు ఆరోపణ చేశానని ఇష్టపూర్వకంగానే తమ మధ్య శృంగారం జరిగిందని కోర్టుకు తెలిపింది. దాంతో టీడీపీ ఎమ్మెల్యేపై కేసును కొట్టి వేసింది. ఇలాంటి కేసులు పెరిగిపోతూడంటంతో తప్పుడు కేసుల్ని ఉపేక్షించేది లేదని హైకోర్టు నిర్ణయించింది. కేసు పెట్టే వరకూ ఎందుకు.. ముందుగానే ఆ మహిళకు మెరుగు నాగార్జున సెటిల్మెంట్ చేస్తే సరిపోయేదిగా అన్న సైటైర్లు వినిపిస్తున్నాయి.