కోట్లాది మంది భక్తుల దేవదేవుడు శ్రీవారు. ఆయన ఒక్క క్షణం దర్శనం కోసం వేల మైళ్ల నుంచి వస్తారు. వేల రూపాయలు హిందువులు ఖర్చు పెట్టుకుంటారు. అయితే ఆయనపై ఏ మాత్రం భక్తి లేని వారు.. ఇతర మతాల వారు కొండపై పనులు చేస్తూంటే ఇబ్బందికరమే. టీటీడీ పూర్తిగా హిందువులకు సంబంధించిందే. అన్యమతస్తులు పని చేయడం వారికి మంచిది కాదు.. భక్తుల విశ్వాసానికీ మంచిది కాదు. కానీ గత ఐదేళ్లుగా జరిగిన ఘోరాలు మాత్రం ఎవరూ ఊహించనివి. అందులో ఒకటి అన్యమత ఉద్యోగులు చేరిపోవడం.
మతం మారిన వారు చాలా మంది కొండపైకి చేరారు. ఇప్పుడు వారందరని ప్రక్షాళన చేయాలని కొత్త చైర్మన్ నిర్ణయించారు. నిజానికి 2019 వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ సమయంలో తిరుమలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి విచారణ చేశారు. అన్యమతస్తులు అని అనుమానం వచ్చిన టీటీడీ ఉద్యోగుల ఇళ్లకు కూడా వెళ్లి పట్టుకున్నారు. ఇది జగన్ రెడ్డికి నచ్చలేదు. సీఎస్‌గా ఉన్న ఎల్వీనే అవమానకరంగా బయటకు పంపేశారు.
2020లో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మంది. ఉద్యోగుల జాబితాను రెడీ చేశారు. కానీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వారి సంఖ్య ఇంకా పెరిగింది. అందుకే తరచూ వివాదాస్పద అంశాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత టీటీడీలోని అన్యమత ఉద్యోగులందరికీ స్వచ్చంద బదిలీ ఆఫర్ ఇస్తారు. వినియోగించుకుంటే సరే లేకపోతే.. ఇంటికి పంపే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.