ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఎన్ని చెప్పినా ఆయన భావజాలం ప్రకారం అమెరికాలో ఉండేందుకు, సంపాదించుకునేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ చొరబాటుదారుడే. ఇలాంటి విషయాల్లో ఆయన ఓ చిన్న మినహాయింపు పాటిస్తారు. అదేమిటంటే తనకు మద్దతుగా ఉంటే మాత్రం పౌరసత్వం లేకపోయినా అమెరికన్ గాే చూస్తారు. అంటే అచ్చమైన భారతీయ రాజకీయనాయకుడి మనస్థత్వం ట్రంప్‌ది. ఇప్పుడు ఆయన మరోసారి అధ్యక్షుడు అవుతున్నారు.
ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ తాము అమెరికా చేరుకోవాలనుకుంటారు. అదో కాంప్లెక్స్ లాంటిది. అందుకే కష్టపడతారు. చాలా ఖర్చు పెట్టుకుని అమెరికా చేరుకుంటారు. అక్కడికి చేరుకోవడానికి అవసరమయ్యే వీసా ఖర్చుల నుంచి , ఫీజుల వరకూ అమెరికాకే ఖర్చు పెట్టాలి. అలా ఖర్చుపెట్టిన తర్వాత అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలంటే ట్రంప్ సతాయిస్తారు. గతంలో హెచ్వన్ బీ వీసా పరిమితులు పెట్టారు. అత్యధిక శాలరీ ఉన్న వారికే ఇవ్వాలన్నారు. ఇలా అనేక ఇబ్బందులు పెట్టారు. ఇక గ్రీన్ కార్డు పరిమితి పెంచేందుకు ఆయన ఏమాత్రం సుముఖంగా ఉండరు. గ్రీన్ కార్డు అర్హత ఉండి దరఖాస్తులు చేసుకున్న వారు పది లక్షలపైగా ఉన్నారు. ఏటికేడు పెరుగుతూనే ఉన్నారు. కానీ కంట్రీ క్యాప్ తీసేసేందుకు మాత్రం ఆయన సుముఖంగా లేరు.
వచ్చే నాలగేళ్ల పాటు ఆయన అమెరికాకు వచ్చే వారిని ఖచ్చితంగా నియంత్రిస్తారు. అమెరికాకు ఉపయోగపడేవారిని.. అమెరికాలో డబ్బులు ఖర్చు పెట్టేవారిని మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన వారు రాకుండా అనేక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అమెరికాకు వెళ్లే విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితులు ఇంకా పెరుగుతాయి.