“భూమి గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇంటే ఇవాళ ఎత్తులో ఉన్నది రేపు అత్యంత కిందకు వస్తుంది” ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాఠం. నిజానికి ఇది ఫిజిక్స్ కాదు..కెమిస్ట్రీ కాదు.. మ్యాథ్స్ కాదు.. జియాలజీ..జువాలజీ అసలే కాదు. ఇది జీవిత సత్యం. జీవితం ప్రతి దశలోనూ నేర్చుకోవాల్సిన గుణపాఠం. లేకపోతే ఏమవుతుంది ? బోర్లా పడిపోతాం. ఎలా అంటే జగన్ రెడ్డిలా !
తన గొయ్యి తాను తవ్వుకున్నారు.. పాతాళంలోకి!
జగన్ రెడ్డి ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి అని ఒక్క సారి అయినా ఆలోచించుకుని ఉంటారా ?. ప్రతి మనిషి తనకు కష్టాలు ఎదురైనప్పుడు ఇలా ఎందుకు జరిగిందని విశ్లేషించుకుంటారు. అలా విశ్లేషించుకుని ఉన్నట్లయితే తన పరిస్థితి ఏమిటి..తాను ఇలా ఎందుకు ఉన్నారో ఆయనకు అర్థమవుతుంది. ఆయనకు అర్థం అయినా అవకపోయినా ఆయన పరిస్థితిని చూస్తే.. ఐదేళ్ల పాటు ఆయనకు అధికారం ఇచ్చిన ప్రజలకు జారి కాదు కదా అసహ్యం వేస్తుంది. ఇలా జరగాల్సిందే.. ఇంకా ఇంకా జరగాల్సిందే అనిుకునేలా ఆయన చేసుకున్నారు. 209లో జగన్ రెడ్డి తన జీవితంలో అత్యంత గొప్ప విజయాన్ని నమోదు చేశారు. కానీ అదే ఆయన జీవితంలో అతి పెద్ద పరాజయం అవుతుందని ఆయన ఊహించి ఉండరు. విజయం అనుకున్నారు. కానీ ఆ విజయం నెత్తికెక్కిన రోజునే ఆయన ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోయారు. ఆ పతనం ఇప్పుడు పాతాళానికి చేరుకుంది. నేను మళ్లీ అధికారంలోకి వస్తా.. మీ సంగతి చూస్తా అనే అరుపుల దాకా వచ్చింది. కానీ ఇలా అరవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన విశ్లేషించుకుంటే.. ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. కానీ మళ్లీ నిలబడే ఆలోచనే లేని విపరీత మనస్థత్వం ఉన్న జగన్ నుంచి ఎంతో మంది పాఠాలు నేర్చుకోవచ్చు.
అధికారంలోఉండి చేసిన పాపాలకు వరుస శిక్షలు !
“అధికారంలోకి వచ్చే వరకూ మా జగన్ అన్న బంగారం.. అధికారం అందిన తర్వాత ఆయన మారిపోయారు.. ఎవరూ గుర్తు పట్టలేనంత మారిపోయారు” అని సాక్షాత్తూ రక్తం పంచుకుని పుట్టిన చెల్లి షర్మిల ఆస్తుల వివాదంలో కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ అంతగా ఎందుకు మారారు ?. ఆస్తి కోసమా ? . వైఎస్ సీఎం కాక ముందు సబ్ కాంట్రాక్టుల కోసం ఆయన లగడపాటి వంటి వారి దగ్గర పడిగాపులు కాసి ఉండవచ్చు కానీ ఆయన సీఎం అయిన తర్వాత సంపదకు లోటే లేదు. ఎంత ఉందంటే.. తన తర్వాత మరో పది తరాలు కూర్చుని తిన్నా తరగనంత సంపద ఉంది. కానీ అందులో నుంచి చెల్లికి వాటా ఇవ్వడం ఇష్టం లేక .. మొత్తం కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. అలా ఎవరైనా చేస్తారా ? . పబ్లిక్ లైఫ్ లో ఉన్న జగన్ రెడ్డి ఆస్తుల కోసం తల్లి, చెల్లిపై కోర్టులో పిటిషన్ వేస్తారా ?. అది కూడా తాను రాసిచ్చిన ఆస్తుల్ని.. వారిపై ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు రాసిచ్చానని ఇప్పుడు అవేమీ లేవని వెనక్కి తీసుకుంటానని చెబుతారా ?. అసలు ఇలాంటి ఆలోచనలు జగన్ రెడ్డికే వచ్చాయా లేకపోతే ఆయన సలహాదారులు తప్పుదోవ పట్టించి ఉంటారా ?. నిజంగా సలహాదారులు ఇచ్చి ఉంటే.. తల్లి,చెల్లికి తనకు చిచ్చు పెడుతున్నందున అలాంటి సలాహాలు ఇచ్చిన వారిని చెప్పుతో కొట్టి బయటకు పంపించాలి. కానీ ఆ సలహాలు జగన్ రెడ్డివి కాబట్టే సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన కోర్టుకెళ్లడమే కాకుండా ఘర్ ఘర్ కీ కహాని అని కబుర్లు చెబుతున్నారు. సొంత కుటుంబాన్ని దూరం చేసుకున్న ఆయనకు.. ఈ పాపం.. శాపం ఎలా తగిలింది ?. ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే తాను తన రాజకీయ స్వార్థం కోసం ఎన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టానో గుర్తు చేసుకుంటే.. రివర్స్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ ఎంత గట్టిగా చూపిస్తుందో ఆయనకు అర్థమైపోతుంది. ఆయన రాజకీయ స్వార్థంతో చీల్చేసిన కుటుంబాలు ఇప్పుడు కలసిపోయి ఉండవచ్చు కానీ.. జగన్ రెడ్డి తన తల్లి, చెల్లితో ఇక జీవితంలో కలవలేరు. వారు ఆయనను నమ్మలేరు. ఎందుకంటే.. జగన్ రెడ్డి కర్కశ ప్రేమ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడదని వారందరికీ తెలిసిపోయింది.
కుటుంబాన్నే దూరం చేసుకున్న ఆయనకు ఇక పార్టీ ఎక్కడ మిగులుతుంది!
జగన్ రెడ్డికి ఈ రివర్స్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ ఒక్క కుటుంబం విషయంలోనే కాదు.. పార్టీ విషయంలోనూ.. రాజకీయం విషయంలోనూ కనిపిస్తోంది. ఐదేళ్ల కిందట ఆయన ఎలా ఉన్నారు ? ఇప్పుడు ఎలా ఉన్నారు ? దీనికి కారణం ఏమిటి ?. ప్రజలు అచంచల విశ్వాసం పెట్టుకుని ఇచ్చిన ఇధికారాన్ని జగన్మోహన్ రెడ్డి వందకు వంద శాతం దుర్వినియోగం చేశారు. ప్రజలందరికీ తలా పది రూపాయలు పంచి మిగతాది దుబారా చేయడమే కాకుండా ప్రజల రక్తమాంసాలు పీల్చారు. దానికి తోడు కక్ష సాధింపులు. జగన్ రెడ్డి డైలీ దినచర్యలో.. ఎవరో ఒక టీడీపీ నేతని అరెస్టు చేయడమో.. వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడమో చేయకపోతే చాలా అశాంతిగా ఫీలయ్యేవారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి పల్లా శ్రీనివాసరావు వరకూ ఆస్తులు నష్టపోని టీడీపీ నేత ఉన్నారా ?. ఒక్కరంటే ఒక్క టీడీపీ నేత కుటుంబాన్ని ఆయనా తన సోషల్ సైకోలతో రంకులు అంటగట్టించకుండా ఉన్నారా?. ఇదంతా ఆయన మానసిక తృప్తి. అప్పుడే చాలా మంది చెప్పారు.. అధికారం శాశ్వతం కాదు.. కాస్త కళ్లు తెరుచుకుని పరిపాలించు అని, కానీ అందరికీ పది రూపాయలు పంచుతున్నాను కాబట్టి అందరూ తనను దేవుడి మాదిరిగా చూస్తారని ఓట్లేయక చస్తారా.. ఓటు వేయకపోతే చస్తారని అనుకున్నారు. అందుకే ముఫ్పై ఏళ్ల సీఎం అనుకున్నారు. ఆయన ఘోరమైన మానసిక వికృతానికి రుషికొండ ప్యాలెస్ సాక్ష్యం. ఇప్పుడు ఆయనకు ఈ విషయంలో రివర్స్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ కనిపిస్తోంది. అక్రమ సంపాదనతో కట్టుకున్న ప్యాలెస్‌లలో అయినా ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి.
ఇదే పరిస్థితి వస్తుందని పదేళ్ల పాటు అందరూ చెప్పలేదా ?
గురువారం ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటల సేపు గగ్గోలు పెట్టారు. ఆయన చెప్పినవన్నీ గతంలో టీడీపీ నేతలు చెప్పారు. అయ్యా మీకు అధికారం శాశ్వతం కాదు.. తప్పులు చేయవద్దు.. అధికారులకు పోస్టింగ్‌లు ఆశ చూపించి వ్యవస్థల్ని నాశనం చేయవద్దు.. ఇలా చేయడం వల్ల తర్వాత జరిగే పరిణామాలు అత్యంత ఘోరంగా ఉంటాయని హెచ్చరించారు. కానీ ఎవరి మాట అయినా విన్నారా ?. ఇవాళ ఆయన పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తానని బెదిరిస్తున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తానని బెదిరిస్తున్నారు. తన సోషల్ మీడియా యాక్టివిస్టులు వందల మందిని అరె్స్టు చేశారని గగ్గోలు పెడుతున్నారు. ఇవన్నీ ఆయన చేసిన వాటిలో ఒక్క శాతం కూడా ఉండవు. ఇంకా ఇంకా ఎన్నో సంచలనాత్మక రివర్స్ బటర్ ఫ్లై ఓఫెక్టుల్ని జగన్ రెడ్డి చవిచూడాల్సి ఉంది. అవన్నీ గతంలో చేసిన పనులకు రివర్స్‌లో వస్తున్నవే. కొత్తగా వచ్చేవేమీ ఉండవు. కానీ వాటి ఎఫెక్ట్ భరించలేనంతగా ఉంటుంది. వైఎస్ మాటల్లో చెప్పాలంటే.. రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అని భయడేలా ఉంటాయి. ఎందుకంటే.. చర్య కంటే ప్రతి చర్య ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉటుందని ఫిజిక్స్‌లో చదువుకున్నాం.
రాజకీయాల్లో ఉండకూడని .. ఉండకూడదని నేత జగన్!
చంద్రబాబు మూడు టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చాలా మంది ప్రతిపక్ష నేతల్ని చూశారు. ఇంత కాలం ఆయన ఎందుకు ఇంత సాఫీగా రాజకీయాలు చేయగలిగారు?. ఈ ఒక్క సూక్ష్మం అర్థం చేసుకుంటే జగన్ రెడ్డి కూడా రాజకీయం అంటే ఏమిటో అర్థం చేసుకుని ఉండేవారు.కానీ రాజకీయం అంటే ఆయనకు సంపాదించుకోవడం.. రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా భావించి తిట్టించడం.. వేధించడం.. అధికారంలో ఉంటే కేసులు పెట్టించడం. బుద్ది ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద తన కార్యకర్తలకు బీపీ వచ్చిందని దాడి చేయిస్తారా ? . కానీ జగన్ చేయించారు. ఎన్నికలకు ముందు కనీస ఆధారాల్లేకుండా ప్రతిపక్ష నేతను జైల్లో పెట్టించి అహం తీర్చుకునే ముఖ్యమంత్రి ఉంటారా ? జగన్ రెడ్డి ఉంటారు. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అన్నది చూసుకోకుండా.. ముందు తన కోరిక తీర్చుకోవాలనుకునేవారు.. తర్వాత పరిణామాలకూ బాధ్యత వహించాలి. ఇప్పుడు అవే పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆయనకు అర్థం కాని విషయం ఏమిటంటే.. అవకాశాలు ప్రతీ సారి రావు. ప్రజాస్వామ్యంలో అయితే అసలు రావు. ఒక్క సారి అవకాశం దుర్వినియోగం చేసుకుంటే.. నేలవ్యవస్పాలు చేసుకున్నట్లే. ఇక ఎప్పటికీ అది దరి చేరదు.
చెరపకురా చెడెవు !
జగన్ రెడ్డి నేను మళ్లీ వస్తాను.. మీ అంతు చూస్తానని హెచ్చరిస్తున్నారు. కానీ ఇప్పటికి అయింది నాలుగు నెలలు మాత్రమే. ఇంకా నాలుగేళ్ల ఎనిమిది నెలల సమయం ఉంది. ఏముంది రెప్పపాటులో అయిపోతుందని జగన్ తన పార్టీ నేతలకు చెబుతున్నారు. కానీ ఇంకా రెప్పవేయక ముందే గగ్గోలు పుట్టే పరిస్థితి వచ్చింది. మళ్లీ నిలబడతామని ఆయన అనుకుంటున్నారు. భూమి గుండ్రంగా ఉంటుందన్నది నిజం. అలాగే ఇప్పుడు పైన ఉన్నది రేపు కిందకు వస్తుందన్నది కూడా నిజం. కానీ ఆ మార్పుల్ని బ్యాలెన్స్ చూసుకుని నిలబడే ఓపిక లేని.. అలాంటి మనస్థత్వం లేని వాళ్లు కింద పడతారు. మళ్లీ గెలవడం అసాధ్యం. భూమి తిరుగుతూనే ఉంటుంది.. కింద పడిన వారు.. పడిన చోటే దొర్లుతూ ఉంటారు. ఎందుకంటే.. అప్పటికే బ్యాలెన్స్ తప్పిపోయారు. ఇక నిలబడటం అనేది అసాధ్యం. ఇది వైసీపీలో కాస్త తెలివి ఉన్న వాళ్లందరికీ తెలుసు. అధికారం అండతో జగన్ రెడ్డి చేసిన తప్పులు.. ఎప్పటి వరకూ వెంటాడతాయో చెప్పడం కష్టం. చివరికి న్యాయవ్యవస్థపైనా ఆయన భయంకరమైన దాడి చేశారు. ఆయన టార్గెట్ చేయని వ్యవస్థ లేదు. రివర్స్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ లో అప్పట్లో చేసిన పనులు.. నిర్వాకాల ప్రతిఫలాన్ని వచ్చే ఐదేళ్లు అనుభవించాలి. ఈ శిక్షలు ఆయనను పాతాళంలో ఏ లోతులో ఉంచుతాయో చెప్పడం కష్టం. అందుకే అంటారు.. చెరపకులా చెడేవు అని. జగన్‌కు ఇప్పటికీ అర్థం కాదు..కానీ ఆయనను చూసి ఎలా ఉండకూడదో అందరూ నేర్చుకోవాలి.