సోషల్ సైకోల అరెస్టులు వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఓ వ్యవస్థీకృత మాఫియా సామ్రాజ్యాన్ని నడిపినట్లుగా ఈ సోషల్ మాఫియాను వైసీపీ నడుపుతోంది. దీన్ని ఇంత కాలం చూసిన వారు తప్పించుకున్నారు. సజ్జల భార్గవరెడ్డి, గుర్రం దేవందర్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి మరో ముగ్గురు నలుగురు ఈ వ్యవహారం మొత్తం చూసేవారు. కానీ ఎప్పుడు అయితే వైసీపీ ఓడిపోయిందో.. అప్పుడు వీరంతా తప్పించుకున్నారు. సోషల్ మీడియాతో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా మారిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియకుండా దాచి పెట్టేశారు. విదేశాలకు పంపేశారని అంటున్నారు.
వైసీపీ ఓడిపోయాక.. సోషల్ మీడియాపై కేసులు ఖాయమని.. వదిలి పెట్టరని తెలుసు కాబట్టి ముఖ్యులంతా జంప్ అయ్యారు. చాలా మందిని తెచ్చి పెట్టాలని చూశారు కానీ ఎవరూ రాలేదు. చివరికి ఆ నాగార్జున యాదవ్ అనే వ్యక్తిని పెట్టాలనుకున్నా.. దండం పెట్టేశాడు. అందుకే ఎవరికీ తెలియని వ్యక్తిని తెచ్చి పెట్టారు. కానీ తమ సైకోతనం మాత్రం తగ్గకూడదని వారంతా తెరవెనుక నడిపిస్తూనే ఉన్నారు. తెర వెనుక వారు..తెర ముందు మాత్రం ఈ బకరాలు. ఇప్పుడు వందల మంది అరెస్టు అయ్యారు. సజ్జల భార్గవ్ తో పాటు వీళ్లకు కేసుల్లో ఇరుక్కునే కంటెంట్ పంపించిన వారు మాత్రం సేఫ్ గా ఉన్నారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అసలేం జరిగిందో అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ.. తమ స్వార్థం కోసం.. కొన్ని వందల మంది జీవితాలను జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి నాశనం చేస్తున్నారు. తన కుమారుడు.. తమ బంధువులు మాత్రం సేఫ్ గా ఉండాలని అనుకుంటున్నారు. కానీ కింది స్థాయి వ్యక్తుల్ని మాత్రం.. మీరు పోరాడండి.. మేము బెయిల్ ఇప్పిస్తాం.. జైలుకెళ్లినందుకు కాస్త డబ్బులు ఇస్తాం అంటున్నారు. ఈ కుట్ర గురించి వారికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వారిని ఎకరాలుగా వాడేసుకుంటున్నారని తెలుసుకోలేక కేసుల్లో ఇరుక్కున్నారు.. ఆ ట్రాన్స్లోనే ఉండేలా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంది మరి.