జనవరిలో పార్టీ ఆఫీస్ ప్రారంభిస్తానని జోగి రమేష్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని మైలవరంలో పెట్టి చెప్పుకొచ్చారు. ఆయనను మైలవరం ఇంచార్జ్ గా నియమించి మూడు నెలలు అవుతోంది. కానీ ఇప్పుడే మొదటి సారిగా ఆయన సమావేశం పెట్టారు. ఈ మూడు నెలలు ఆయనేం చేశారంటే.. జనసేనలో చేరేందుకు ప్రయత్నించరట. కానీ అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా తలుపులు తెరుచుకోకపోవడం.. పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నరాని వార్తలు గుప్పుమనడంతో వెంటనే కార్యకర్తల సమావేశం పెట్టి జగన్ ను పొడిగారు. ఆయన వెంటే నడుస్తానని చెప్పుకొచ్చారు.
కానీ కార్యాలయం ప్రారంభించడానికి ఇంకా రెండు, మూడు నెలలు ఎందుకు అన్నది మాత్రం చాలా మందికి అర్థం కావడం లేదు. నిజానికి మైలవరం నియోజకవర్గం జోగి రమేష్‌కు కొత్తేం కాదు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించారు.. ఇంచార్జ్ గా చేశారు. ఇవాళ అనుకుంటే రేపు ఆఫీసు ప్రారంభిస్తారు. కానీ అడుగు పెట్టేందుకు ఆయన సంశయిస్తున్నారు. బహుశా జనసేనలో తలుపు కొట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తున్నారేమోనని.. ఎప్పుడో ఒక సారి తీయకపోతారా అన్న ఆశతో ఉన్నారని చెబుతున్నారు.
అధికారం ఉంది కదా అని జోగి రమేష్ చిన్న చిన్న తప్పులు చేయలేదు. నేరుగా చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లడమే కాదు..ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టారు. ఆయన పనితనానికి నోటి దురుసుతనానికి మెచ్చి జగన్ రెడ్డి రెండేళ్ల మంత్రి పదవి ఇచ్చారు కానీ ఇప్పుడు ఎప్పుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. తనే కాదు తన కుమారుడు జైలుకెళ్లి వచ్చాడు. ఇంకా తట్టుకోలేమని ఆయన అనుకుంటున్నారు.