విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత సాయి దుర్గ తేజ్ ఓ పాన్ ఇండియా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. హనుమాన్ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం. ఇప్పటికే ఈ సినిమా నుంచి “ఇంట్రూడ్ ఇన్టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ”అనే వీడియో విడుదల చేశారు. సినిమా ఎంత భారీగా ఉంటుందో ఈ వీడియో పరిచయం చేసింది.
ఈ సినిమాలో స్టార్ కాస్ట్ సందడి కూడా గట్టిగానే వుంది. సీనియర్ హీరోలు ఈ సినిమాలో కీలక పాత్రధారులుగా మారుతున్నారు. జగపతిబాబు, సాయి కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మరో సీనియర్ హీరో శ్రీకాంత్ చేరారు. ఇక్కడితో అయిపోలేదు.. ఇంకొందమంది స్టార్ నటులు ఇందులో మెరిసే అవకాశం వుంది.
ఇందులో సాయి తేజ్ మునుపెన్నడూ చేయని క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. బి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్. త్వరలోనే టైటిల్ ని రివిల్ చేస్తారు.