మూసి ప్రక్షాళకు అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కుకుంటూ వెళ్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేసీఆర్,కేటీఆర్, హ రీష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాతిక వేల కోట్లు తిన్నానని ప్రచారం చేస్తున్నారని.. తాను అవినీతి చేయదల్చుకుంటే మీరు తెచ్చిన ధరణి చాలని మండిపడ్డారు. మూసిన ప్రక్షాళన చేయకపోతే తన జన్మధన్యం కానట్లేనన్నారు.
మూసి ప్రక్షాళన అడ్డుకంటే బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటానని రేవంత్ హెచ్చరించారు. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తేదీ చెప్పాలని సవాల్ చేశారు. మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే… మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా అని ప్రశ్నించారు. నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా ?మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుందని.. ఇవాళ్టి పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందని హెచ్చరించారు.
2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలు పెడతానని సవాల్ చేశారు. ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయన్నారు. అంతకు ముందు రేవంత్రెడ్డి సంగెం కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర చేశారు. మూసీలో నీటి కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించారు. భీమలింగంకు పూజలు చేశారు. ఆ సమయంలో కోమటిరెడ్డి రేవంత్ ను బాహుబలితో పోల్చారు. రేతులతో మాట్లాడుతూ రేవంత్ పాదయాత్ర సాగింది.