పొంగులేటి త్వరలో బాంబులు పేలుతాయి అని సియోల్లో అన్నారు . వెంటనే కేటీఆర్ తనను అరెస్టు చేస్తారని దమ్ముంటే చేస్కోండని సవాల్ చేశారు. మళ్లీ ఇటీవల అలాగే చేశారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి అయితే. ఆయన రోజూ మూడుసార్లు ట్వీట్లు చేస్తున్నారు. శుక్రవారం అయితే ఎవరో దిశ, దివాణం లేని మీడియా మలేషియా పారిపోయాడని రాసిందని సోషల్ మీడియా మొత్తాన్ని రంగంలోకి దింపారు. చివరికి పారిపోయాడని అనుకుంటారని ఆయన మలేషియాకు వెళ్లకుండా వెనక్కి వచ్చేశారు.
తాను ఇంట్లోనే ఉన్నానని అరెస్టు చేసుకవాలని సవాల్ చేస్తున్నారు. అసలు ఇక్కడ విషయం ఏమిటంటే.. కేటీఆర్ ను అరెస్టు చేస్తామని ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ నేత చెప్పడం లేదు. ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో రూ. 55 కోట్లు అక్రమంగా విదేశీ సంస్థకు బదిలీ చేశారన్నది నిజం. దాని వెనుక కేటీఆర్ పాత్ర ఉందని.. అయనే బాధ్యత వహించారని ఎవరూ చెప్పలేదు. ఇంకా ఏసీబీ దర్యాప్తు జరుగుతోంది. ఆ డబ్బులు ఎవరికి పంపించారు.. ఎవరికి చేరింది.. ఎలా ఖర్చు పెట్టారు అన్నది ఏసీబీ దర్యాప్తులో తేలుతుంది.
కానీ కేటీఆర్ మాత్రం.. రోజూ బయటకు వచ్చి..నేను అరెస్టుకు రెడీ అని సవాల్ చేయడం మాత్రం విచిత్రంగా ఉంది. ఆయనతప్పు చేశారని ఆయనకు తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా అలా తరలించిన రూ.యాభై ఐదు కోట్లు బీఆర్ఎస్ ఆన్ లైన్ ప్రచారానికి ఖర్చు పెట్టిందని ప్రచారం చేయబోతున్నారని అంటోంది. అంటే పోలీసులకు అలా దొరికిపోయారని వారికి క్లారిటీ వచ్చిందేమో కానీ..రివర్స్ లో ప్రచారం ప్రారంభించారు. కేటీఆర్ కంగారు ప్రకటనలు.. బీఆర్ఎస్ సోషల్ మీడియా కవరింగులు చూస్తే.. అడ్డంగా దొరికిపోయారని అందుకే ఇలాంటి డ్రామాలేస్తున్నారని సామాన్యులు కూడా అనుకునే అవకాశం ఉంది.