ఏది అయితే జరగకూడదని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకున్నారో అదే జరిగింది. ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిపై పులివెందులలో కేసు నమోదు అయింది. సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఆయన చేసిన నిర్వాకాలే దీనికి కారణం. పులివెందులలో కేసు నమోదు చేయడం వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో అనేక మంది సైకోల్ని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రమైన సైకోలు అయితే రిమాండ్ కు పంపుతున్నారు. తప్పయిపోయిందని కాళ్లా వేళలా పడుతున్నవారి విషయంలో ఓ అవకాశం ఇచ్చేందుకు నోటీసులు ఇస్తున్నారు.
వైసీపీ సోషల్ మీడియా చేసిన అకృత్యాల విషయంలో ప్రభుత్వం మారితే కఠిన చర్యలు తప్పవని వైసీపీ పెద్దలకు తెలుసు. అందుకే రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచే సజ్జల భార్గవ్ రెడ్డిని అండర్ గ్రౌండ్‌కు పంపించి వేశారు. గతంలో మంగళగిరి కార్యాలయంలో ఉండే ఆయన ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు. ఫోన్లకు అందుబాటులో లేరు. ఆ పదవిని కూడా ఓ ఎకరాను చూసి ఇచ్చేశారు. ఏమైనా అయితే ఆయనే బాధ్యత అనుకుంటారని అలా మార్చేశారు. కానీ సజ్జల భార్గవ్ ను మాత్రం వదల్లేదు.
వైసీపీ సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు కానీ ముందుగానే ఓ పద్దతి ప్రకారం సమాచారం సేకరించుకుని ఒకేసారి ఎటాక్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. సజ్జల భార్గవ్ రెడ్డి ఎక్కడ ఉన్నారో కానీ ఆయన మాత్రం సేఫ్ గా ఉండి.. తన కోసం పని చేసిన వారందర్నీ మాత్రం జైలుకు పంపుతున్నారు. ఈ లాజిక్ ఆ కేసుల పాలవుతున్నవారికి అర్థమవుతుందో లేదో మరి !