ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. సంపద పెంచడంతోపాటు ఆ సంపదను రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగించాల్సి ఉంది. దీనికి సంబంధించి గత నాలుగు నెలల్లో ప్రభుత్వం తీరిక లేకుండా కసరత్తు చేసింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం ఎఫెక్టులు మరో రెండేళ్ల పాటు సులువుగా వెంటాడతాయి. వాటిని ఎదుర్కొంటూ నిధుల సమీకరణ చేసుకుంటూ పథకాలు అమలు చేసుకుంటూ పాలన చేయాల్సి ఉంది.
ప్రస్తుత ప్రభుత్వం పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అభివృద్ధి, ఆదాయం పెంపునకు ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే పెట్టుబడులు, పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. కేంద్రం నుంచి గరిష్టంగా నిధులు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు అత్యంత ముఖ్యమైనవి. వాటికి నిధులు కేటియిస్తే చాలా వరకూ రాజకీయంగా వచ్చే విమర్శలకు చెక్ పెట్టినట్లవుతుంది.
జగన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం ఎలా చేశారో అసెంబ్లీలో ప్రభుత్వం బయట పెట్టే అవకాశం ఉంది.అందుకే వారెవరూ ఆసెంబ్లీకి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. బడ్జెట్ సమావేశాలకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలకు జగన్ అవకాశం ఇవ్వలేదు. అయితే ప్రశ్నలు అడగవచ్చని..ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్లవచ్చని కొత్తగా ఓ చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు లేదా జగన్ వచ్చినా రాకపోయినా అసెంబ్లీ దానికదే జరిగిపోతుంది. ఏకపక్షంగా కాకుండా…ప్రజల ముందు గత ప్రభుత్వ నిర్వాకాలన్నీ ముందు పెట్టి వారి నైజాన్ని వెల్లడించే ఆవకాశం ఉంది.