ఎట్టకేలకు సినిమాలపై మూడ్ మళ్లింది చిరంజీవికి. 150వ సినిమా తరవాత వరుసగా సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారాయన. తన కమ్ బ్యాక్ సినిమా కథ గురించి చిరు యేళ్ల తరబడి కసరత్తు చేశాడు. తనకు తగిన కథల్ని ఎంచుకోవడం ఎంత కష్టమో బాగా అర్థమవుతోంది. వరుసగా సినిమాలు చేయాలంటే ముందుగా కథలు రెడీ చేసుకోవాలని తెలిసొచ్చింది. అందుకే 150వ సినిమా జరుగుతుండగానే తన 151వ చిత్రానికి సంబంధించి కథ ఒకటి సెట్ చేసుకొని పెట్టుకోవాలని భావిస్తున్నాడట చిరు. అందులో భాగంగానే బోయపాటి శ్రీనుకి చిరు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు టాక్. ‘మంచి కథ ఉంటే చెప్పు.. సినిమా చేద్దాం’ అంటూ కబురంపాడట చిరు.
నిజానికి బోయపాటితో చిరు ఎప్పుడో సినిమా చేయాల్సింది. బాలకృష్ణతో తీసిన సింహా, లెజెండ్ కథల్ని ముందు చిరుకే వినిపించాడు బోయపాటి. అయితే అప్పట్లో ఆ సినిమాలు కార్యరూపం దాల్చలేదు. సరైనోడు తరవాత బోయపాటిని పిలిచి చిరు మాట్లాడాడని, ఈసారి కలిసి సినిమా చేద్దాం… సిద్దంగా ఉండు అంటూ మాటిచ్చినట్టు టాక్. మరి ఈసారైనా బోయపాటి తన కథతో చిరుని మెప్పిస్తాడా?? అదే జరిగితే చిరు 151వ సినిమాకి సంబంధించి దర్శకుడ్ని వెదుక్కోవాల్సిన అవసరం లేనట్టే.