మళ్లీ మేమే వస్తామని కేసీఆర్ అంటున్నారు. కేటీఆర్ కూడా అదే చెప్పి అధికారుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రయత్నాలు అలా ఉన్నాయా అంటే.. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తున్నాయి. ఫీల్డ్‌లో ఎంత ఉందనేది బీఆర్ఎస్ పార్టీ నేతల రిలాక్సింగ్ రాజకీయాలే సాక్ష్య్ంగా నిలుస్తున్నాయి.
దళితబంధు నిధుల కోసమంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆందోళన కూడా కేవలం సోషల్ మీడియా కోసమే. పది మంది కూడా లేకుండా ఆయన చేసిన డ్రామాను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇక ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి మూసి ప్రాజెక్టు సహా ప్రతి ఒక్క అంశంలోనూ ఓ రెండు యూట్యూబ్ చానళ్లు, మూడుట్విట్టర్ అకౌంట్లు తప్ప పెద్దగా పట్టించుకుంటున్నవారు. లేరు. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్తున్న పరిస్థితులు లేవు.
అధికారం పోయిన మొదట్లో కేటీఆర్ తమకు ఓ ముఫ్పై యూట్యూబ్ చానళ్లు ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చేవారు . ఆ తప్పు మళ్లీ చేయకూడదన్నట్లుగా ఆయన చానళ్లను ప్రారంభించేసినట్లుగా ఉన్నారు. ఉన్న వాటిని కొనడమో.. కొత్తవి రంగంలోకి తేవడమో చేసి.. వాటిలోనే బీఆర్ఎస్ కనిపించేలా చేసుకుంటున్నారు. బయట ఏం జరుగుతుందో అంచనాకు రాలేకపోతున్నారు.
కేసీఆర్ చాలా రోజుల తర్వాత మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చినా.. అవి వైరల్ కాలేదు. ఎందుకిలా జరిగిందో బీఆర్ఎస్ ఆలోచిస్తుందో లేదో కానీ.. సోషల్ మీడీయా ప్రభావం ఎక్కువే కానీ.. గ్రౌండ్ రియాల్టీతో సంబంధం లేకుండా దానితోనే గెలిచేస్తారనుకుంటే అంత కంటే అమాయకత్వం ఉండదన్న అభిప్రాయం ఆ పార్టీ దిగువ శ్రేణిలో వినిపిస్తోంది.