ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యాపారాలను కైవసం చేసుకుంది. వైసీపీ నేతలు.. వారి బంధువులు.. బినామీలు లిక్కర్ నుంచి అంబులెన్స్ ల వరకూ దేన్నీ వదిలి పెట్టలేదు. 108 అంబులెన్స్‌ల నిర్వహణలో అప్పటివరకూ ఉన్న జీవీకేను వెళ్లగొట్టి అరబిందోకు కాంట్రాక్ట్ కు ఇచ్చేశారు. అరబిందోకు అది పెద్ద మొత్తం కాదని కేవలం సేవాభావంతోనే చేయడానికి ముందుకు వచ్చిందని బిల్డప్ ఇచ్చారు.. కానీ పదేళ్ల పాటు అంబులెన్స్ సర్వీసులు ఎంత నాసిరకంగా ఉన్నాయో స్పష్టమయింది.
ఇప్పుడు ఆ సంస్థ అసలు ఎలాంటి సర్వీసులు అందించిందో ఆడిట్ చేస్తే.. టెంపోల్ని నడిపినట్లుగా నడిపారు కానీ.. అంబులెన్స్‌లో ఉండాల్సిన సౌకర్యాలను కల్పించలేదని తేలింది.అంతే కాదు… ఎంతో దగ్గరగా ఉన్న సమయంలో ఫోన్ కాల్స్ వచ్చినా చాలా ఆలస్యంగా స్పందించారు. లైఫ్ సపోర్టు అవసరమైన సందర్భాల్లోనూ వాటిని సమకూర్చలేకపోయారు. కనీసం ఆక్సిజన్ ను కూడా అందుబాటులో ఉంచడంలో విపలమయ్యారు. ఇవన్నీ ఆడిట్ లో తేలడంతో ప్రభుత్వం ఆశ్చర్యపోయింది.
తమ నిర్వాకం వెలుగు చూడటంతో.. తమకు రావాల్సిన డబ్బులు ఇస్తే వెళ్లిపోతామని అరబిందో అడుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఏం చేయనుందో చూడాల్సి ఉంది. కొత్తగా అంబులెన్స్ నిర్వహణకు టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే అరబిందోను మాత్రం అంత తేలిగ్గా వదలి పెట్టే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ప్రాణాలు నిలపాల్సిన అంబులెన్స్‌ల విషయంలోనూ కక్కుర్తి పడటం ఏమిటన్న విస్మయం వైద్య వర్గాలు, ప్రభుత్వ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.