క్రిష్.. ఉత్తమాభిరుచి గల దర్శకుల్లో క్రిష్ ఒకడు. ఆయన నుంచి గమ్యం, వేదం, కంచె, కృష్ణం వందే జగద్గురుమ్ లాంటి మంచి సినిమాలొచ్చాయి. ఇప్పుడు అనుష్కతో ఓ సినిమా చేస్తున్నారు. నిర్మాతగా కొన్ని వెబ్ సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు. క్రియేటీవ్ ఫీల్డ్‌లో పీక్స్ లో ఉన్న క్రిష్.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడాలనుకొంటున్నారు. ఈరోజు ఆయన పెళ్లి. ఓ రిజిస్టర్ ఆఫీసులో చాలా సింపుల్ గా చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. గైనకాలజిస్ట్ ప్రీతీ చల్లా క్రిష్ జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ వివాహానికి అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హజరు కానున్నారు. పెళ్లయ్యాక సన్నిహితులకు ఓ విందు ఇవ్వబోతున్నారు క్రిష్.
క్రిష్ కి ఇది రెండో పెళ్లి. ఇది వరకు ఆయన రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకొన్నారు. పెళ్లయ్యాక రెండేళ్లకే విడిపోయారు. 2018 నుంచి క్రిష్ ఒంటరిగానే ఉంటున్నారు. ఇప్పుడు ఆయన పెళ్లికి సిద్ధమయ్యారు. క్రిష్ రెండో పెళ్లి విషయం ఇండస్ట్రీలోవ కూడా ఎవ్వరికీ తెలీదు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్ గా చేసుకోవాలని క్రిష్ భావించారు. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ తో సరిపెడుతున్నారు. క్రిష్ – అనుష్కల కాంబోలో రూపొందిన ‘ఘాతీ’ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. 2025 ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘కన్యాశుల్కం’ నవల ఆధారంగా ఓ సినిమా తీశారు క్రిష్. దానికి ఆయన నిర్మాత. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందిస్తున్నారు. ఆ వివరాలు త్వరలో బయటకు వస్తాయి.