హారర్ కామెడీకి ఇప్పుడు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో `స్త్రీ 2` సూపర్ హిట్టయ్యింది. తెలుగులో ప్రభాస్ చేస్తున్న ‘రాజా సాబ్’ కూడా ఇదే జోనర్లో రూపుదిద్దుకొంటోంది. `కాంచన 4` కోసం రాఘవ రారెన్స్ రంగం సిద్ధం చేస్తున్నాడు. అన్ని భాషల్లోనూ దెయ్యం కథలు కొత్తగా రెడీ అవుతున్నాయి. ఇది వరకు కొత్త హీరోలే హారర్ సినిమాలు చేసేవారు. ఇప్పుడు స్టార్లు కూడా తోడయ్యారు. ‘రాజాసాబ్’ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. అయితే మెగా హీరోలెవరూ ఇప్పటి వరకూ ఈ జోనర్ టచ్ చేయలేదు. తొలిసారి వరుణ్ తేజ్ ఈ జోనర్లో ఓ సినిమా చేయబోతున్నాడు.
వరుణ్ తేజ్ ‘మట్కా’ ఈనెలలోనే విడుదల కానుంది. ఆ తరవాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనికి ‘కొరియన్ కనకరాజు’ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇదో హారర్ కామెడీ సినిమా. రాయలసీమ నేపథ్యంలో సాగబోతోంది. ఇందుకోసం వరుణ్ తేజ్ రాయలసీమ భాషనీ, యాసనీ నేర్చుకోబోతున్నాడు. ఈ సినిమాలో హీరో పాత్రే కాకుండా, అన్ని పాత్రలూ ఇదే యాసలో మాట్లాడాలి. అందుకోసం అందరితో ఓ వర్క్ షాప్ నిర్వహించాలనుకొంటున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తం