వైసీపీ సోషల్ మీడియాలో బరి తెగించిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పటికే తప్పుకున్నారు కానీ కొంత మందిని పాత రికార్డులు వెంటాడటం ఖాయంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన మరుక్షణం ఆర్జీవీని సైలెంట్ అయిపోయారు.కానీ ఆయనను వదిలే అవకాశాలు లేవు. ఆయన ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. కేసులు నమోదయ్యాయి. నేడో రేపో అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు. మరో పెద్ద మనిషి పోసాని కృష్ణమురళి కూడా రెడీ అవుతున్నారు.
గతంలో ఆయన మాట్లాడిన మాటలకు పోలీసులు కేసులు పెట్టలేదు. ఆయన పై కేసులు పెట్టాలని కోర్టులో ఆదేశించాయి. జనసైనికులు ఆయన మాటలపై కోర్టులకు వెళ్లి న్యాయపోరాటం చేసి మరీ రెండు కేసులు పెట్టేలా ఆదేశాలు తెచ్చారు. కోర్టుల ఆదేశం మేరకు కేసులు అయితే పెట్టారు కానీ విచారణ చేయడం.. అరెస్టులు చేయడం వంటివి ఏమీ చేయలేదు. కనీసం పోసానిని విచారణకు పిలిచే ప్రయత్నం చేయలేదు. ఇవ్పుడు ఆ కేసులు ఆయనను ఏపీకి పిలిపించే అవకాశాలు ఉన్నాయి.
మాట్లాడితే బీపీ తెచ్చుకుని చంపేస్తున్నారని లబలబలాడిపోయే పోసానికి నోటీసులు ఇస్తే చాలు మిగతా పోలీసులు ఏమీ చేయాల్సిన పని లేకుండా ఆయనకు ఆయనే హింసించుకుని మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటారు. అందుకే పోలీసులు కోర్టు ఆదేశాలతో నమోదైన కేసుల్లో ముందుగా నోటీసులు జారీ చేసి.. ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎంత ఓవరాక్షన్ చేసినా.. ఆయన జైలు నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే ఐదు కాదు… పదేళ్ల పాటు ఆయన చేసి నోటి విరేచనాల గబ్బు ఐదేళ్లు జైల్లో పెట్టినా పోదు.