ఆంధ్రప్రదేశ్‌కు చుట్టూ ఉన్న మూడు రాష్ట్రాల్లో మూడు మెట్రో సిటీలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్ర సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇవి ఎంత వరకు ప్లస్సో.. ఎంత వరకు మైనస్సో తెలియదు కానీ.. రాష్ట్ర శివారు ప్రాంతాలకు మాత్రం రియల్ ఎస్టేట్ పరంగా ఎంతో మేలు చేస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మూడు నగరాలు ఏపీ సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంటాయి. వీటిలో బెంగళూరు మరీ సమీపంగా ఉంటుంది. ఎంతగా అంటే.. ఇప్పుడు కలిసిపోయేంతగా. బెంగళూరు సిటీ బస్సులు రెగ్యులర్ గా పెనుకొండలోని కియా పరిశ్రమ వరూకూ అప్ అండ్ డౌట్ చేస్తూంటాయి. హిందూపురం నుంచి అయితే రెగ్యులర్ సర్వీసులు ఉంటాయి.
చాలా మంది ఇప్పుడు ముందుచూపుతో హిందూపురం వైపు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెడుతున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టు ఇంకా చాలా దగ్గర. అందుకే బెంగళూరులో ఓ చిన్న అపార్టుమెంట్ పై పెట్టుబడి పెట్టడం కన్నా.. హిందూపురం లో ఓ పెద్ద ఇండిపెడెంట్ హౌస్ ను కొని పెట్టుకోవడం మంచిదని ఆలోచించేవారు ఉన్నారు. ఇటీవలి కాలంలో హిందూపురం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. కియా పరిశ్రమ వచ్చిన తర్వాత ఓ రేంజ్ కు వెళ్లింది. కానీ గత పదేళ్ల కాలంలో అక్కడా తిరోగమనమే చూసింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది.
ఏపీ ప్రభుత్వం బెంగళూరులో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఆ నగరానికి అతి సమీపంలోనే పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో పరిశ్రమలు పెట్టే అవకాశాల్ని కల్పించేందుకు సిద్దపడుతోంది. అందుకే నేరుగాకర్ణాటకలో కాకపోయినా దగ్గర్లో పెట్టుబడులు పెట్టినా ఓకే అనుకునే కంపెనీల ఆఫర్లు వైపు చూస్తున్నాయి. ఫలితంగా బెంగళూరు పెట్టుబడుల్ని కొన్ని అనంతపురం ఆకర్షిస్తోంది. త్వరలో మరిన్ని భారీ పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. అనంతపురంలో సగం బెంగళూరులో భాగం అయినా ఆశ్చర్యం ఉండదు. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి .. కాస్త ఆ ప్రాంతాలతో పరిచయం ఉన్న వారికి మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు.