ఈనెల 14న వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పలాస తీసిన కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. ఈయన స్వతహాగా కథకుడు. సాహిత్యం నుంచి సినిమా రంగంలోకి వచ్చారు. ఆయన రాసిన కొన్ని కథలు సాహిత్య విమర్శకుల ప్రశంసలు పొందాయి. నిజానికి ఈ కథను కూడా ఆయన మొదట ఒక షార్ట్ స్టోరీ గానే రాయాలనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.
‘మట్కా గేమ్ గురించి నాకు తెలీదు. మొదటిసారి ఓ పెళ్లి వేడుకలో దీని గురించి విన్నాను. మా బంధవుల్లో ఒకరు మట్కా లో ఏజెంట్ గా చేశారు. ఆయన అప్పటి పరిస్థితి గురించి చెప్పినపుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. వైజాగ్ లో నైట్ క్లబ్బులు, క్యాబరీలు ఉండేవి. వైజాగ్ వన్ టౌన్ గురించి, అక్కడ కల్చర్, మట్కా గురించి తెలుసుకున్నప్పుడు దాన్ని కథగా రాయాలనిపించింది. ‘వాడిపోయిన పువ్వులు’ పేరుతో ఒక షార్ట్ స్టోరీని రాయడం మొదలుపెట్టాను. కానీ రాస్తున్నప్పుడు ఇది సినిమా మెటీరియల్ అని అర్థమైంది. అప్పుడు సినిమా కథగా మార్చాను’ అని చెప్పుకొచ్చారు కరుణ కుమార్.