మెగాస్టార్ చిరంజీవి జపాన్ వెళ్లారు. అక్కడ పది రోజుల పాటు ‘విశ్వంభర’ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ నెలాఖరులోగా చిరు ఇండియాకి తిరిగొస్తారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సంక్రాంతికి రావాల్సింది. కానీ… ‘గేమ్ ఛేంజర్’ వల్ల వాయిదా పడింది. మేలో విశ్వంభరని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
‘విశ్వంభర’ తరవాత చిరంజీవి చేయబోయే సినిమాపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. చాలామంది దర్శకులు కథలు పట్టుకొని తిరుగుతున్నారు. కానీ చిరు మాత్రం ఎవరికీ ఓకే చెప్పలేదు. విశ్వంభర లేట్ అవ్వడం, చిరు ఇటీవల అనారోగ్యానికి గురవ్వడం వల్ల… ఆయన కొత్త సినిమాలపై ధ్యాస పెట్టలేదు. జపాన్ షెడ్యూల్ తో విశ్వంభర టాకీ దాదాపుగా పూర్తవుతుంది. హైదరాబాద్ తిరిగొచ్చాక రెండు పాటల్ని తెరకెక్కిస్తారు. సంక్రాంతి బరిలో ఉంటే… ఈ పాటికే షూటింగ్ మొత్తం పూర్తయ్యేది. మే కాబట్టి, నిదానంగా షూటింగ్ జరుపుకొంటున్నారు. మరోవైపు వీఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. టీజర్లో చూపించిన వీఎఫ్ఎక్స్ పట్ల అభిమానుల్లో అసంతృప్తి ఏర్పడింది. అందుకే ఈసారి మరింత శ్రద్ద పెడుతున్నారని టాక్.