వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్య సలహాదారులలో ఒకరిగా ఎప్పుడూ క్యాంపు ఆఫీసులోనే కనిపించిన రాజీవ్ కృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఆయన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు అల్లుడు. గోదావరి జిల్లాలలో అత్యంత ప్రభావిత కుటుంబం అయిన ఆంద్రాసుగర్స్ కుటుంబానికి చెందిన వారు. మాజీ మంత్రి వనిత వీరి కుటుంబం అండతోనే రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు రాజీవ్ కృష్ణ వైసీపీకి దండం పెట్టేస్తున్నారు.
రాజీవ్ కృష్ణ జగన్ వ్యతిరేకించే సామాజికవర్గానికి చెందినవారు. కానీ కోవూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు చంద్రబాబుతో వ్యతిరేకించడంతో ఆయనను జగన్ దగ్గరకు తీసుకున్నారు . పార్టీకి పనికి వస్తారని అయన అల్లుడు అయిన కృష్ణబాబుకు పదవి ఇచ్చారు. సలాహాదారుగా పెట్టుకున్నారు. అయితే కులం కారణంగా ఆయనను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతూ వచ్చారు. ఫలితంగా ఆయన కూడా చిరాకుపడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కులంపై కొంత మంది వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ కులద్వేషంతోనే పాతాళంలోకి పడిపోయారని ఇంకా తీరు మార్చుకోరా అని ప్రశ్నించారు.
తర్వాత ఈవీఎంల విషయంలోనూ అనవసర వ్యాఖ్యలు చేస్తూండటంతో కౌంటర్లు ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ ఆఫీసు వైపు వెళ్లలేదు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆయన నారా లోకేష్‌తో చర్చలు జరిపారని టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కృష్ణబాబు చనిపోయినప్పుడు కూడా టీడీపీ నేతలే ఎక్కువగా పరామర్శించారు. వైసీపీ నేతలు పట్టించుకోలేదు . దీంతో ఇక రాజీవ్ కృష్ణ తమ పార్టీకి లేరని.. అవసరం లేదని వైసీపీ ఫిక్సయిపోయింది. ఆ సామాజికవర్గానికి చెందిన వారు వైసీపీలో ఉంటే బానిసల్లా బతకాల్సిందేనని… రాజీవ్ కృష్ణ వ్యవహారం స్పష్టం చేసిందంటున్నారు.