పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న వారిపై సైకో అనే ముద్ర వేస్తున్నారని మీడియాపై మండిపడ్డారు. టీటీడీ చైర్మన్‌పై బూతులందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునూ వదల్లేదు. ఇప్పుడు పోసాని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు… పిచ్చి కుక్క అని వదిలేస్తారా అన్నది తర్వాత విషయం కానీ.. వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారికి పోసానికి ఉన్నంత దైర్యం కూడా లేదా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఓడిపోగానే వంశీ, కొడాలి సైలెంట్ అయిపోయారు. ఒకటి, రెండు సార్లు కొడాలి నాని మాట్లాడారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని సవాల్ చేశారు. మళ్లీ కనిపించడం లేదు. వంశీ అయితే అసలు మీడియా ముందు కు రావడం లేదు. ఆయన కార్లు మారుస్త.. ఫోన్లు మారుస్తూ ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కోర్టుకు రావాల్సి వచ్చినప్పుడు అనుచరులకు లాయర్ గెటప్పులు వేసి సెక్యూరిటీగా తెచ్చుకుంటున్నారు.
అధికారం పోయినా తమలో ఫైర్ తగ్గలేదని వీరు నిరూపించాలని వైసీపీ క్యాడర్ కోరుకుంటున్నారు. గతంలో మాట్లాడినట్లే పోసాని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా పోసానిని ఆదర్శంగా తీసుకుని మీడియా ముందుకు వచ్చి టీడీపీని, చంద్రబాబును బూతులుతిట్టాలని కోరుకుంటున్నారు. పేకాటకేసుల్లో మహా అయితే కాస్త ఫైన్ వేసి వదిలేస్తారని మళ్లీ ఆడుకుంటారని ఓ సారి కొడాలి నాని చెప్పారు. అలాగే బూతులు తిట్టినా అంతే. అంత మాత్రం దానికి భయపడి దాక్కోవడం ఎందుకని వైసీపీ క్యాడర్ పిలుపునిస్తున్నారు. మరి వంశీ, నాని స్పందిస్తారా ?